తెలంగాణ

పరిహారం రాలేదని నిర్వాసితుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోయినిపల్లి, ఆగస్టు 22: అధికారులు అసలైన అర్హులకు పరిహారం అందించడంలో చూపిన నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. ఆ గ్రామం మధ్యమానేరు జలాశయ నిర్మాణంలో ముంపునకు గురవుతుంది. ఆ గ్రామంలోని మిగతా నిర్వాసితులు ఆ గ్రామానికి కేటాయించిన ఆర్ అండ్ ఆర్ మోడల్ కాలనీలో కొత్తగా ఇండ్ల నిర్మాణం చేపట్టారు. అయితే తనకు మాత్రం కుటుంబ ప్యాకేజి కూడా అందలేదని, నిరాశ, నిస్పృహలకు గురైన 25 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా బోయినిపల్లి మండలం నీలోజిపల్లి మధ్యమానేరు జలాశయ నిర్మాణంలో ముంపునకు గురవుతోంది. కుటుంబ పరిహారం అందలేదని ఆ గ్రామానికి చెందిన అనుముల అనీల్ (25) అనే యువకుడు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు ప్రొబేషనరీ ఎస్‌ఐ సతీష్ తెలిపారు.
గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం.. అనుముల అనీల్ అనే యువకుడు ఇంటర్ వరకు చదివి వ్యవసాయం చేసుకుంటున్నాడు. గ్రామంలోని తన తోటివారందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజిలో భాగంగా అధికారులు కుటుంబ ప్యాకేజి అందించారు. కానీ ఆ యువకుడికి మాత్రం కుటుంబ పరిహారం రాలేదు. కుటుంబ పరిహారం, ఇండ్ల పరిహారం వచ్చిన గ్రామంలోని మిగతా వారందరు నీలోజిపల్లి గ్రామానికి కేటాయించిన ఆర్ అండ్ ఆర్ కాలనీలో నిర్మాణాలు చేపట్టారు. గత ఆరు నెలల కాలంగా నిర్మాణాలు జరుగుతుండడంతో తనకు పరిహారం అందకపోవడంతో మానసిక ఆందోళనకు గురై సోమవారం ఉదయం 7.30 గంటలకు పోలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అనీల్ నిర్జీవంగా పడి ఉండడాన్ని చూసిన చుట్టుపక్కల వాళ్లు బంధువులకు సమాచారం అందించారు. అనీల్ అప్పటికే మృతి చెంది ఉన్నాడు. ఈ మేరకు తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ప్రొబేషనరీ ఎస్‌ఐ సతీష్ తెలిపారు.

చిత్రం..ఆత్మహత్య చేసుకున్న యువకుడు అనిల్