తెలంగాణ

జంట హత్యల నిందితులను అరెస్టు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: వరంగల్ జిల్లాలో ఇద్దరు మైనర్ బాలికలను హతమార్చిన నిందితులను అరెస్టు చేయాలని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుకుంటున్న ప్రియాంక, భూమిక అనే మైనర్ బాలికలు అనారోగ్యంతో నవంబర్ 24న వారి స్వగ్రామమైన పర్వతగిరి మండలంలోని కంబాలకుంటకు వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆ బాలికలను కిడ్నాప్ చేసి హతమార్చారన్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వారి మృతదేహాలు చెన్నారావుపేట మండలం ఖాదర్‌పేట్ గుట్టలో కనుగొన్నట్టు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీ్ధర్ మాట్లాడుతూ బాలికల హత్య వెనుక టిఆర్‌ఎస్ నాయకుల హస్తం ఉందని ఆరోపించారు. హంతకులెవరో గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. హతురాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ బాలికల అపహరణపై ఫిర్యాదు చేసినప్పటికీ నిర్లక్ష్యం వహించిన నల్లబెల్లి సబ్ ఇనె్స్పక్టర్‌తోపాటు బాలికల హంతకులను అరెస్టు చేసి వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఐటిడిఏ ప్రాజెక్టు డైరెక్టర్ సస్పెన్షన్‌పై సిట్టింగ్ జడ్జిచేత విచారణ జరిపించాలని, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితోపాటు ఎంపి సీతారాం నాయక్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
డిజిపిని కలిసిన కాంగ్రెస్ నేతలు
వరంగల్ జిల్లాలో ఇటీవల జరిగిన ఇద్దరు గిరిజన బాలికల హత్య కేసులో నిందితులను అరెస్టు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర డిజిపి అనురాగ్ శర్మను కాంగ్రెస్ నేతలు కలుసుకున్నారు. అమాయక బాలికలను హత మార్చిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరారు. గురువారం మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్‌గౌడ్, బలరాంనాయక్, సురేష్ హెట్కార్, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు డిజిపిని కలసిన వారిలో ఉన్నారు.