తెలంగాణ

‘మహా’ ఒప్పందాలపై నేడు సంబురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్టత్రో ఒప్పందాలు కుదరడంతో ప్రాజెక్టులకు అడ్డంకులన్నీ తొలగిపోయాయని ప్రభుత్వం సంబురాలు జరుపుతోంది. మహారాష్టల్రో ఒప్పందాలు కుదుర్చుకుని తిరిగి వస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, అధికారుల బృందానికి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఈ బృందానికి బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలుకుతారు. మంత్రులు, టిఆర్‌ఎస్ శ్రేణులతో పాటు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, రైతులను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపట్టగా ఘన స్వాగతం పలికేందుకు అధికారికంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ముంబైలో ఒప్పందం కుదరగానే తెలంగాణ భవన్‌లో భారీ ఎత్తున బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. చారిత్రకమైన ఒప్పందం ద్వారా తెలంగాణ రైతల కలలు నెరవేర్చే అవకాశం లభించిందని మంత్రులు తెలిపారు. అంతర్ రాష్ట్ర వివాదాల నడుమ నాలుగు దశాబ్దాలుగా నలుగుతున్న మూడు ప్రాజెక్టులకు ఒకే రోజు ఒప్పందం జరగడం చారిత్రాత్మకమని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అభినందించారు. మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య జరిగిన ఈ ఒప్పందం దేశానికే ఆదర్శం అని మంత్రులు తెలిపారు.
కాగా, 1974 నుంచి ప్రాజెక్టు నిర్మించకుండా ఏం చేశారని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు. నాలుగు దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్, 17 ఏళ్లపాటు అధికారం వెలగబెట్టిన టిడిపి తెలంగాణ ప్రాజెక్టులను నిర్మించలేదని, వీళ్లు చేయలేని పని టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తుండడంతో సహించ లేక పోతున్నారని విమర్శించారు. అసాధ్యం అనుకున్నదానిని ముఖ్యమంత్రి కెసిఆర్ సాధ్యం చేసి చూపించారని అన్నారు. భవిష్యత్తులో కృష్ణా జలాల్లో కూడా తెలంగాణకున్న న్యాయమైన వాటా సాధించుకుంటామన్నారు.చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ఈ ఒప్పందం బంగారుతెలంగాణకు పచ్చని పైరు హారంగా మారుతుందని అన్నారు.

మహారాష్టత్రో ఒప్పందం చేసుకుని హైదరాబాద్‌కు వస్తున్న కెసిఆర్ బృందానికి ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్న మంత్రి శ్రీనివాస యాదవ్, తెరాస నేతలు