తెలంగాణ

ముగిసిన పోలీస్ కస్టడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, ఆగస్టు 23: గ్యాంగ్‌స్టర్ నరుూం భార్య, అక్క, వాచ్‌మెన్ దంపతుల పోలీస్ కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జైలుకు తరలించారు.
మంగళవారం షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ నుండి గ్యాంగ్‌స్టర్ నరుూం భార్య హసీనాబేగం, అక్క ఖలిమాబేగం, వాచ్‌మెన్ అబ్దుల్ మతిన్, వాచ్‌మెన్ భార్య సలీమాను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం స్థానిక కోర్టులో హాజరు పరిచి జిల్లా జైలుకు రిమాండ్‌కు తరలించారు. అంతకుముందు గ్యాంగ్‌స్టర్ నరుూం భార్య హసీనాబేగంను మిలీనియం టౌన్‌షిప్‌లోని నరుూం ఇంటికి తీసుకువెళ్లి విచారించారు. అక్కడి నుండి నేరుగా షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జిల్లా జైలు నుండి పోలీస్ కస్టడీ వారం రోజులు తీసుకుని విచారించిన తరువాత తిరిగి జిల్లా జైలుకు తరలించినట్లు షాద్‌నగర్ టౌన్ సిఐ రామకృష్ణ వివరించారు. ఈ నలుగురి నుండి పలు విషయాలను సేకరించినట్లు పేర్కొన్నారు.

విద్యుత్ షాక్‌తో చిరుతపులి మృతి
దేవరకద్ర, ఆగస్టు 23: విద్యుత్ షాక్‌తో చిరుతపులి మృతి చెందిన సంఘటన దేవరకద్ర మండల పరిధిలోని వెంకటయ్యపల్లి గ్రామసమీపంలో చోటు చేసెకుంది. అటవీ శాఖ అధికారి తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం వెంటకయ్యపల్లి గ్రామ సమీపంలోని చిరుతపులి సంచరించడంతో ఆ సమీపంలోని వ్యవసాయ పొలంకు విద్యుత్ కంచె ఏర్పాటు చేయడంతో ప్రమాదవశాత్తుగా విద్యుత్ షాక్‌తో చిరుతపులి మృతి చెంది ఉంటుందని చిరుతపులిని రైలు పట్టాలపై పడేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు చిరుత మృతికి కారణమైన వారిని గుర్తించి కేసు నమోదు చేస్తామని తెలిపారు.
ముంపు బెంగతో ఆటోడ్రైవర్ మృతి
తొగుట, ఆగస్టు 23: మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌తో తమ గ్రామం ముంపునకు గురవుతుందన్న బెంగతో ఆటోడ్రైవర్ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా తొగుట మండలంలోని వేములఘాట్‌లో జరిగింది. గ్రామస్తులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన హుస్సేన్ (41) మల్లన్నసాగర్‌కు వ్యతిరేకంగా గ్రామస్థులు చేస్తున్న ఆందోళనలో పాల్గొన్నాడు. ఇటీవల పోలీసుల లాఠీచార్జీలో సైతం గాయపడ్డాడు. గ్రామం ముంపునకు గురవుతుండడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన హుస్సేన్‌కు మంగళవారం తెల్లవాజరుజామున ఛాతిలో నొప్పి రావడంతో చికిత్స కోసం సిద్దిపేట ఏరి యా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే యజమాని మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది.