తెలంగాణ

రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి మరో 17 సవరణలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: రియల్‌ఎస్టేట్ రంగ అభివృద్ధికి మిగిలిన 17 సవరణలూ చేయాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ అసోసియేషన్స్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కోరింది. ప్రస్తుతం 23 సవరణలు చేసి రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కృషి చేసినందుకు అసోసియేషన్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కానె్ఫడరేషన్ ఆఫ్ రియల్‌ఎస్టేట్ డెవలెప్‌మెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్), తెలంగాణ రియల్‌ఎస్టేట్ డెవలెప్‌మెంట్ అసోసియేషన్ (ట్రెడా), తెలంగాణ డెవలెపర్స్ అసోసియేషన్, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్లు తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపాయి. క్రెడాయ్ అధ్యక్షుడు ఎస్.రామ్‌రెడ్డి, ట్రెడా అధ్యక్షుడు పి.దశరథ్‌రెడ్డి, టిడిఏ అధ్యక్షుడు జివి రావు, టిబిఎఫ్ అధ్యక్షుడు జి.ప్రభాకరరావు, క్రెడాయ్ సిఇఓ ఎం.వి.రాజేశ్వరరావు గురువారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
గతంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌తో జరిగిన సమావేశంలో 40 రకాల విజ్ఞప్తులు చేశామని, వాటిలో 23 పరిష్కరించి ఆదేశాలు జారీ చేశారని మిగిలిన 17 కూడా చేసి రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తిగా ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రియల్‌ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుందని అన్నారు. గత కొనే్నళ్లగా స్తబ్ధతగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వ నిర్ణయాలు ప్రోత్సాహాన్ని కలిగించాయని అన్నారు.

విలేఖరులతో మాట్లాడుతున్న రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు