తెలంగాణ

జిల్లాల ముసాయదాపై నిరసన సెగల హోరు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్/మహబూబ్‌నగర్/ ఆదిలాబాద్/ ఆగస్టు 23: ప్రభుత్వం విడుదల చేసిన జిల్లాల ముసాయిదాపై కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబా ద్ జిల్లాల్లోని ప్రలు ప్రాంతాల ప్రజలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. నిరసన కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. ముసాయిదాలో కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల పేరు లేకపోవడంతో ఆ నియోజకవర్గం ప్రజలు ఆందోళనలను మరింత ఉధృతం చేశారు. సిరిసిల్లను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం తలపెట్టిన ఎల్లారెడ్డిపేట మండల బంద్ ఉద్రిక్తంగా మారింది. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసి వేయించారు. తహశీల్దార్ పవన్‌కుమార్ కారును అడ్డుకున్నారు. కామారెడ్డి, కరీంనగర్ ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకోలకు దిగారు. సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల జిల్లా జెఏసి ఆధ్వర్యంలో మహా పాదయాత్రను ప్రారంభించారు. అంబేద్కర్, నేతన్న విగ్రహాలకు పూలమాలలు వేసి అంబేద్కర్ కూడలి నుండి ప్రారంభమైన మహా పాదయాత్ర వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి పాదాల చెంత వరకు కొనసాగింది. కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ కోరుట్ల బంద్‌కు పిలుపునివ్వగా విజయవంతమైంది. ఇటు సిద్దిపేటలో హుస్నాబాద్, కోహెడ మండలాలను కలపవద్దంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గ్రామగ్రామాన ర్యాలీలు నిర్వహించారు. మొత్తానికి జిల్లాల ఏర్పాటుపై రాజుకున్న రగడ రోజురోజుకు ఉధృతమవుతోంది.
ఆదిలాబాద్‌లో సిఎం దిష్టిబొమ్మ దగ్ధం
ఆదిలాబాద్ జిల్లా నుండి నిర్మల్‌ను విడదీయడాన్ని నిరసిస్తూ మంగళవారం ఆదిలాబాద్ జిల్లా పరిరక్షణ కమిటీ అధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి సిఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
నదీఅగ్రహారంలో కెసిఆర్‌కు పిండప్రదానం
నడిగడ్డ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాలను జిల్లా చేయకుండా వనపర్తిని జిల్లా చేయడంతో మంగళవారం నదిఅగ్రహారం పుష్కరఘాట్ వద్ద అఖిలపక్షం నేతల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పిండప్రదానం చేశారు.