తెలంగాణ

వేములఘాట్‌ను కాపాడుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొగుట, ఆగస్టు 24: మల్లన్నసాగర్‌లో ముంపునకు గురికాకుండా వేములఘాట్‌ను కాపాడుకునేందుకే ప్రజాభిప్రాయం మేరకు సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు బుధవారం రాజీనామాలు చేశారు. పంచాయతీ పాలకవర్గంతో పాటు గ్రామానికి చెందిన ఫీల్డ్‌అసిస్టెంట్ రాజీనామాను సైతం ఎంపిడిఓ రాజిరెడ్డికి అందించారు. మెదక్ జిల్లా తొగుట మండలం ముంపు గ్రామమైన వేములఘాట్‌లో బుధవారం గ్రామ ప్రజలు సమావేశం నిర్వహించి ప్రజాప్రతినిధులందరిచే గ్రామాన్ని కాపాడుకునేందుకు రాజీనామాలు చేయాలని కోరారు. ఇటీవల గ్రామస్థులకు సమాచారం ఇవ్వకుండా పలుమార్లు కొందరు ప్రజాప్రతినిధులు, నాయకులు మంత్రి, ఎమ్మెల్యేను కలుస్తున్నారని ఆగ్రహించిన ప్రజలు ప్రజాప్రతినిధులను రాజీనామా చేసి ప్రజల పక్షాన నిలవాలని బుధవారం సమావేశంలో కోరారు. దీనికి ప్రజాప్రతినిధులు అంగీకరించి దీక్షాస్థలి వద్ద జరిగిన గ్రామసభలో రాజీనామా పత్రాలపై సంతకాలు చేశారు. సర్పంచ్ మంజుల, ఉపసర్పంచ్ కరుణాకర్, వార్డు సభ్యులు రేఖ, అశోక్‌రెడ్డి, నర్సవ్వ, రుక్కవ్వ, మమత, బాలమణి, వెంకటలక్ష్మి, వెంకటేశం, నాగయ్య పదవులకు రాజీనామా చేయగా ఫీల్డ్ అసిస్టెంట్ నాగరాజు ఉద్యోగానికి రాజీనామా చేసిన ప్రతులను ఎంపిడిఓ రాజిరెడ్డికి కార్యాలయంలో అందించారు. గ్రామానికి చెందిన పిఎసిఎస్ డైరక్టర్ శ్రీనివాస్‌రెడ్డి సైతం రాజీనామా పత్రంపై సంతకాలు చేయగా ఎంపిటిసి పోచవ్వ అందుబాటులో లేకపోవడంతో గురువారం రాజీనామా చేయనున్నట్లు కుమారుడు అంజయ్య తెలిపారు. కాగా 81రోజులుగా ప్రాజెక్టును నిరసిస్తు గ్రామంలో చేస్తున్న దీక్షలు కొనసాగుతున్న విషయం విదితమే. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరుగకుండా బందోబస్తు ఏర్పాటుచేసి వాహనాలను తనిఖీ చేశారు.

వేములఘాట్ గ్రామసభలో
రాజీనామా పత్రాలపై సంతకాలు చేస్తున్న ప్రజాప్రతినిధులు..
రాజీనామా ప్రతులను ఎంపిడిఓకు అందిస్తున్న సర్పంచ్, వార్డుమెంబర్లు