తెలంగాణ

రగులుతున్న జిల్లాల రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్/ఆదిలాబాద్/వరంగల్/ఆగస్టు 24: కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ప్రభుత్వం జారీచేసిన ముసాయిదాపై పలు జిల్లాల్లో నిరసనలు రోజురోజుకి ఉధృమవుతున్నాయి. జిల్లా హోదా దక్కని కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల, రెవెన్యూ డివిజన్ హోదా దక్కని కోరుట్ల, ఇతర జిల్లాల్లోకి తమను చేర్చవద్దంటూ హుస్నాబాద్, కోహెడ, ఇల్లంతకుంట తదితర మండలాల్లో నిరసనలు ఉధృతమవుతున్నాయి. కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం చేపట్టిన ఆందోళన లాఠీచార్జి వరకు దారితీసింది. రెండురోజుల బంద్‌కు పిలుపు నిచ్చిన సాధన కమిటీ బుధవారం జాతీయ రహదారిపై ధర్నాకు దిగింది. దీంతో ఆ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ కాగా, పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఒకరు ఆర్టీసీ బస్సు ఎక్కి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా, మరొకరు సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఈ సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం ఎనిమిది మంది కౌన్సిలర్లు రాజీనామాలు చేశారు. సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు మున్సిపల్ చైర్‌పర్సన్ ఇంటిని ముట్టడించారు. జిల్లా కోసం అమరణ దీక్ష చేపట్టిన మనోజ్ పరిస్థితి విషమంగా మారడంతో మున్సిపల్ చైర్‌పర్సన్, జెఏసి నాయకులు నచ్చజెప్పి దీక్షను విరమింపజేశారు. ఇల్లంతకుంట మండలాన్ని కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో వాణిజ్య, వ్యాపార సంస్థలను బంద్ చేయించారు. సిద్దిపేటలో హుస్నాబాద్, కోహెడ మండలాలను కలపవద్దంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఒకప్పటి జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌ను తిరిగి జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్షం నేతలు బుధవారం ఆసిఫాబాద్ పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. మంచిర్యాలతో కొమురం భీంకు ఎలాంటి సంబంధం లేకున్నప్పటికీ దొరల స్వార్థం కోసం ఆసిఫాబాద్ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని రజీహైదర్ ఆరోపించారు. ఇప్పటికైనా ఆసిఫాబాద్‌ను కొమురం భీం జిల్లాగా ప్రకటించకపోతే ఆందోళనలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం ప్రకటించిన జిల్లాల ఏర్పాటు ముసాయిదాలో జనగామ, ములుగుకు చోటు దక్కకపోవడంపై అక్కడి ప్రజలు, జిల్లా సాధన సమితి నాయకులు ఆందోళన కార్యక్రమాలను మరింత ఉద్ధృతం చేశారు. జనగామ జిల్లా ఏర్పాటు కోరుతూ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆమరణ నిరాహార దీక్షను బుధవారం తెల్లవారు జామున పోలీసులు భగ్నం చేశారు. నిరాహార దీక్ష చేపట్టిన జెఏసి నాయకులను వరంగల్ ఎంజిఎంకు తరలించినప్పటికి దీక్షలు అక్కడే కొనసాగిస్తున్నారు. జనగామలో విద్యాసంస్థలు బంద్ చేసి విద్యార్థులు నిరసన తెలిపారు. పెద్దపాడు గ్రామంలో ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. లద్నూరులో రాస్తారోకో చేపట్టారు. అదేవిధంగా లింగాల గణపురంలో జనగామ జిల్లా ఏర్పాటు కోరుతూ రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. స్టేషన్ ఘన్‌పూర్‌లో జనగామ జిల్లా కావాలని కోరుతూ జెఏసి నాయకులు రాస్తారోకో చేపట్టారు. ఇదిలావుండగా ములుగును జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మక్క-సారలమ్మ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం విద్యార్థులు భారీ ర్యాలీగా బయల్దేరి ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. మరోవైపు హన్మకొండ జిల్లా ఏర్పాటుకు అన్నివర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తక్షణమే హన్మకొండ జిల్లా ఏర్పాటు ప్రకటన విరమించుకోవాలని అన్ని పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. అయితే జిల్లాల ఏర్పాటు అభ్యంతరాలపై కలెక్టరేట్‌లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయగా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. హన్మకొండ జిల్లా ఏర్పాటు వద్దంటూ 240 దరఖాస్తులు అందగా, జయశంకర్‌జిల్లా కోసం 138, వరంగల్ జిల్లా కోసం 69, మహబూబాబాద్ జిల్లా 38 దరఖాస్తులు అందాయి.

లింగాల ఘణపురంలో జనగామ జిల్లా ఏర్పాటు కోరుతూ రిలే నిరాహార దీక్షలు