తెలంగాణ

నలుగురు విద్యార్థులు అదృశ్యం.. గోవాలో ప్రత్యక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/వనస్థలిపురం/ఉప్పల్, ఆగస్టు 24: హైదరాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న నలుగురు విద్యార్థులు అదృశ్యమైన సంఘటన కలకలం రేపింది. నగరంలో అదృశ్యమైన ఈ నలుగురు విద్యార్థులు గోవాలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఎల్‌బి నగర్ శివగంగానగర్ కాలనీకి చెందిన సాయినాథరెడ్డి (14), ఉప్పల్‌కు చెందిన లిఖిత్ కుమార్ (13), సాయికృష్ణ (14), విజయ్‌కుమార్ (14) ఉప్పల్ కేంద్రీయ విద్యాలయంలో తొమ్మిదవ తరగతి చదువుతున్నారు. మంగళవారం సాయంత్రం హైస్కూల్‌నుంచి వచ్చిన వీరు స్కూల్ యూనిఫాం మార్చుకొని బయటికివెళ్లి కనిపించకుండా పోయారు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఎల్‌బి నగర్, ఉప్పల్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం కేంద్రీయ విద్యాలయానికి వెళ్లిన తల్లిదండ్రులు అక్కడి విద్యార్థులను విచారించి ఆరా తీయగా.. గోవా లేక బెంగుళూరు వెళ్లాలని ఆలోచనలో విద్యార్థులు ఉన్నారని తెలిసింది. పాఠశాల నుంచి బయటకు వెళ్లిన విద్యార్థులు ఎరుపు రంగు మారుతి వ్యానులో ఘట్‌కేసర్ వైపు వెళ్లినట్టు తోటి విద్యార్థులు తెలిపారు. విచారణ చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు విద్యార్థుల ఆచూకీ కనుగొన్నారు. వీరిలో విజయ్‌కుమార్ అనే విద్యార్థి ఇంట్లో నుంచి 4వేల నగదు, ఆభరణాలు తీసుకెళ్లినట్టు గుర్తించారు.