తెలంగాణ

‘హైకోర్టు తీర్పు కెసిఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై కోర్టు ఇచ్చిన తీర్పును బిజెపి స్వాగతిస్తోందని, ఈ తీర్పు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు చెంపపెట్టు అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఆ పార్టీ శాసనసభ పక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్‌లు తెలిపారు. 74వ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. కోర్టులతో మొట్టికాయలు వేయించుకోవడం కెసిఆర్‌కు అలవాటైపోయిందని వారు ఎద్దేవా చేశారు. హైకోర్టు జిహెచ్‌ఎంసి ఎన్నికలపై ఇచ్చిన తీర్పు పట్ల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ (టిపిసిసి) అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కోర్టు తీర్పు నిలబెట్టిందని, ఈ తీర్పు సిఎం కెసిఆర్‌కు చెంపపెట్టు అని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పాలన తీరు మయన్మార్, పాకిస్థాన్‌ను తలపిస్తోందని అన్నారు.
శాతవాహన వర్శిటీ విసి
ఎంపికకు సెర్చ్ కమిటీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 7: తెలంగాణలోని కరీంనగర్‌లో ఉన్న శాతవాహన యూనివర్శిటీకి వైస్ ఛాన్సలర్ ఎంపికకు ప్రభుత్వం సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన మాజీ ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, యుజిసి సభ్యుడు ప్రొఫెసర్ ఇందర్ మోహన్ కాపేతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ ఆర్ ఆచార్య సభ్యులుగా ఉంటారు.