తెలంగాణ

అన్నీ తెలుసనుకోవడం మూర్ఖత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 25: రాష్ట్రంలో పాలకులు మనకే అన్ని తెలుసని, ఇతరులకు ఏమీ తెలియదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని అది మూర్ఖత్వమేనని టిజెఎసి చైర్మన్ కోదండరామ్ వ్యాఖ్యానించారు. గురువారం మహబూబ్‌నగర్‌లోని టిఎన్‌జిఓ భవనంలో కెకె మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘ఎవరి అభివృద్ధి కోసం ఎవరు త్యాగం చేయాలి...నేరం ఎవరిది శిక్షలు ఎవరికి’ అనే సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు కోదండారామ్, హరగోపాల్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. సదస్సులో కోదండరామ్ మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలకు దిగుతోందని దాంతోనే ప్రాజెక్టుల నిర్మాణాల పట్ల, భూసేకరణ పట్ల ప్రజలు భయాందోళనతో ఆందోళనలకు దిగుతున్నారని అన్నారు. అసలు ప్రభుత్వం భూసేకరణ విషయంలో, ప్రాజెక్టుల నిర్మాణం జరిగితే ఎలాంటి లబ్ధి జరుగుతుందనే వాటిపై గ్రామగ్రామాన చర్చ పెట్టాల్సిందని, అలా కాకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి పోలీసులతో తొక్కించైనా భూములు తీసుకుందామనే ధోరణిని వీడాలని ఆయన సూచించారు. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులను తెచ్చిపెడుతుందని అన్నారు. ఇష్టారాజ్యంగా భూసేకరణ చేయొద్దని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి మనిషి ఆత్మగౌరవంతో బతికే తెలంగాణ నిర్మాణం కావాలని, అలా నిర్మాణం కాకుంటే అసమానతలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు. పాలకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తెలంగాణ అమరవీరుల ఆత్మక్షోభిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల పునరావాసం విషయంలో చట్టాల ఆధారంగా వాటికి లోబడి చేపట్టాలని, అలా కాకుండా జిఓల ద్వారా బాధితులకు పునరావాసం కల్పిస్తామనడం మంచి పద్దతి కాదన్నారు. జిఓల ద్వారా పునరావాసం కల్పిస్తే నష్టమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసం మేరకు ప్రాజెక్టుల విషయంలో పాలకులు నడవాలని, ప్రాజెక్టులపై లాభనష్టాలు లోతుగా చర్చ జరగాల్సిందేనని కోదండరామ్ డిమాండ్ చేశారు. ప్రజల బతుకుదెరువు, వారి అస్తిత్వం అన్నీ తమ తరతరాలుగా వస్తున్న వాటిని వదులు కోవాలంటే అంతా సులువైన అంశం కాదని, అందుకే తాము ప్రభుత్వానికి ఓ సూచన, సలహా చేస్తున్నామని అన్నారు.

చిత్రం..మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన సదస్సులో మాట్లాడుతున్న టిజెఎసి చైర్మన్ కోదండరామ్