తెలంగాణ

రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సందీప్ పవార్ సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఆగస్టు 25: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సందీప్ పవార్‌ను సస్పెండ్ చేస్తూ గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఎం. జగన్మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. రిమ్స్‌లో ద్వితీయ సంవత్సరం మెడిసిన్ చదువుతున్న ఒక విద్యార్థినిపై అత్యాచారం యత్నానికి పాల్పడి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు రెండు వారాల కిందటే విద్యార్థిని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయగా, గత 15వ తేదీ నుండి విధులకు హాజరు కాకుండా డాక్టర్ సందీప్ పవార్ పరారీలో ఉన్నారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు డాక్టర్ సందీప్ పవార్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.