తెలంగాణ

ఇక గ్రేటర్ వార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: జిహెచ్‌ఎంసి ఎన్నికలకు ఎన్నికల సంఘం కమిషనర్ వి నాగిరెడ్డి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్ వెలువడిన క్షణం నుంచే నియమావళి అమల్లోకి వస్తుందని, శనివారం నుంచి అభ్యర్థుల ఎన్నికల ప్రచార వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించారు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి నాగిరెడ్డి, జిహెచ్‌ఎంసి ఎన్నికల అథారిటీ, కమిషనర్ బి జనార్దన్ రెడ్డిలు మాట్లాడుతూ జిహెచ్‌ఎంసి ఎన్నికలకు సంబంధించి ఈనెల 12న ఆయా డివిజన్ల రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల కోసం నోటీసు జారీ చేయటంతోపాటు అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. నామినేషన్లకు 4రోజుల సమయం కేటాయిస్తూ 17 వరకు నామినేషన్ల స్వీకరించనున్నట్టు తెలిపారు. తర్వాత 18న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, అభ్యర్థులకు ఈనెల 21 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుందని వెల్లడించారు. అదే రోజు మధ్యాహ్నం 3గంటలు దాటిన తర్వాత పోటీలోవున్న అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నట్లు వివరించారు. తర్వాత ఎన్నికలు అవసరమైతే ఫిబ్రవరి 2న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ నిర్వహించనున్నట్టు నాగిరెడ్డి వివరించారు. అవసరమైనచోట ఫిబ్రవరి 4న రీపోలింగ్ నిర్వహించి, 5న ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతామని వివరించారు. లెక్కింపు ముగిసిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ ప్రక్రియ ముగిసిన తరువాత మేయర్ ఎన్నికకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు నాగిరెడ్డి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇదిలావుంటే, గతంలో ఎన్నడూ లేనివిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి ఇవిఎంలో ‘నోటా’ ఆప్షన్ ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు సంబంధించి శుక్రవారం సర్కారునుంచి ఉత్తర్వులు అందినట్టు ఆయన తెలిపారు.
రిజర్వేషన్లు ఖరారు
రాజకీయవర్గాలు, సామాన్యులు ఎప్పుడెపుడా అని ఎదురుచూస్తున్న జిహెచ్‌ఎంసి పరిధిలోని 150 డివిజన్ల రిజర్వేషన్లను కూడా శుక్రవారమే ఎంతో వ్యూహాత్మకంగా ఖరారు చేసింది. మొత్తం 150 సీట్లలో యాభై శాతం అంటే 75 స్థానాలను వివిధ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు రిజర్వు చేసింది. ఇందులో ఎస్టీకి 1, ఎస్టీ మహిళకు 1, ఎస్సీలకు 5, ఎస్సీ మహిళకు 5, బీసీకి 25, బీసీ మహిళకు 25, మహిళలకు 44 స్థానాలు రిజర్వు చేస్తూ, మిగిలిన 44 స్థానాలను జనరల్ స్థానాలుగా ప్రకటిస్తూ శుక్రవారం ప్రభుత్వ జీవో 25ను జారీ చేసింది.
బిసి జనరల్‌కే మేయర్ సీటు
గ్రేటర్ హైదరాబాద్ మేయర్ సీటు బిసి జనరల్‌కు కేటాయిస్తున్నట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించి నేడు సర్కారు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది.

చిత్రం... గ్రేటర్ ఎన్నికల వివరాలు వెల్లడిస్తున్న ఎన్నికల కమిషనర్ వి నాగిరెడ్డి