తెలంగాణ

వంద ఏసి మినీ బస్సుల కొనుగోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: ఆర్టీసి సంస్థ నష్టాలను అధిగమించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ ఆర్టీసి ఎండి జివి రమణారావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 1400 కొత్త బస్సుల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చామన్నారు. ఇందులో వంద ఏసి మినీ బస్సులకు కూడా ఆర్డర్ ఇచ్చామన్నారు. అంతర్రాష్ట్ర సర్వీసులను పెంచడం, సంస్థ ఆస్తులను పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా ప్రత్యేక దృష్టిని సారించడంతో పాటు బస్టాండ్ ప్రాంగణాల్లో మినీ థియేటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఖాళీ స్థలాలను వినియోగించుకునే క్రమంలోప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. హెచ్‌పిసిఎల్‌తో కలిసి 52 పాయింట్లలో పెట్రోలు పంపుల ఏర్పాటుకు సంబంధించి ప్రణాళిక ఖరారు చేవామన్నారు. ఈ ప్రక్రియ మూడు నెలల్లో పూర్తవుతుందన్నారు. పెట్రోలు పంపు నిర్వహణ వల్ల సాలీనా పది కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్నారు. ఐఒసి కంపెనీ కూడా ఇతర చోట్ల సంస్థతో కలిసి పెట్రోలు పంపుల ఏర్పాటు కోసం ముందుకు వచ్చిందన్నారు. రవాణా శాఖతో కలిసి ప్రైవేట్ వాహనాల అక్రమ రవాణాను నియంత్రించామన్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కృష్ణా పుష్కరాల సందర్భంగా 7560 ప్రత్యేక బస్సులను 26వేల ట్రిప్పులు నడిపామన్నారు. 15 లక్షల మంది పుష్కర యాత్రికులు ప్రయాణించారన్నారు. 1440 ఉచిత బస్సులను నడిపి 7 లక్షల మందిని చేరవేశామన్నారు. పుష్కరాలకు వచ్చిన యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.