తెలంగాణ

జనగామ జిల్లా కోసం రాజీనామాలు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 26: వరంగల్ జిల్లాలో జిల్లాల ఏర్పాటు లొల్లి కొనసాగుతూనే ఉంది. ప్రజల నుండి ఎలాండి డిమాండ్‌లేని హన్మకొండ జిల్లా ఏర్పాటు ప్రతిపాదనపై ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటుంది. జనగామ జిల్లా కావాలని అక్కడి ప్రజలు బలంగా కోరుకుంటున్నప్పటికి జిల్లాల ఏర్పాటు ముసాయిదాలో జనగామ జిల్లా ప్రతిపాదన లేకపోవడం కూడా విమర్శలకు తావిస్తుంది. హన్మకొండ జిల్లా వద్దే వద్దు అంటూ శుక్రవారం విద్యార్ధులు రోడెక్కారు. హన్మకొండ చౌరస్తాలో ఎబిఎస్‌ఎఫ్ అధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. అదే విధంగా వరంగల్ జెఎసి అత్వవసర సమావేశం ఏర్పాటు చేసారు. హన్మకొండ జిల్లా వ్యతిరేకిస్తూ, జనగామ జిల్లాకు మద్దతుగా ఈనె 30 ఇచ్చిన వరంగల్ జిల్లా బంద్ కనీవిని ఎరుగని రీతిలో ఉండాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మాణించింది. అదే విధంగా జనగామ జిల్లా ఎర్పాటు కోరుతూ లింఘాలఘనపురం మండలానికి చెందిన 17మంది సర్పంచ్‌లు, 11మంది ఎంపిటిసిలు కలెక్టర్‌ను కలిసారు. తమ మండలాన్ని యాదాద్రిలో కలుపవద్దు అంటూ, జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని, లేనట్లైతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని కలెక్టర్‌కు తీర్మాన పత్రాన్ని అందచేసారు. మరో వైపు జనగామ జెఎసి నేతలు కూడా సమావేశమై జిల్లా బంద్ సక్సెస్‌పై చర్చించారు. జనగామ జిల్లాకు మద్దతుగా వేల సంఖ్యలో పిర్యాదులు చేయాలని అన్ని వర్గాలకు పిలుపు నిచ్చారు. కాగా హన్మకొండ జిల్లాకు సంబందించి ఇప్పటి వరకు 534, జయశంకర్ జిల్లాకు 254, వరంగల్ జిల్లాకు 117, మహబూబాబాద్ జిల్లాకు100 అభ్యర్ధనలు అందాయి.

హన్మకొండలో రాస్తారోకో నిర్వహిస్తున్న ఎబిఎస్‌ఎఫ్ కార్యకర్తలు