తెలంగాణ

నయాంను పోషించింది మీరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట రూరల్, ఆగస్టు 26: గ్యాంగ్‌స్టర్ నయాంను పెంచి పోషించింది కాంగ్రెస్, టిడిపి నాయకులేనని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలోని మైలార్‌గూడెంలో శుక్రవారం ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన అనంతరం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. తెలంగాణ ప్రభుత్వంలో రౌడీలకు, గుండాలకు కాలం చెల్లిందని ప్రజల భద్రతే ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు. రాష్ట్ర ప్రజలకు, రైతులకు సాగు నీరు - తాగు నీరు అందించాలని ముఖ్యమంత్రి కేసిఆర్ భగీరథ ప్రయత్నం చేస్తున్నారని.. ఆ ప్రయత్నానికి ప్రతిపక్షాలు సహరించాల్సింది పోయి ప్రభుత్వాన్ని, ప్రజలను తికమక పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రజా క్షేత్రంలో వారికి భంగపాటు తప్పదని హెచ్చరించారు. ఆకు పచ్చ తెలంగాణ కోసం తెలంగాణ ప్రభుత్వ అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు. సమైక్య పాలనలో కాంగ్రెస్, టిడిపి నాయకులు తెలంగాణ అరిగోసతో పొట్టకూటి కోసం పట్టణాలకు బయలుదేరి లేబర్లుగా, కాంట్రాక్టు కార్మికులుగా, ఆటో డ్రైవర్లుగా జీవనం కొనసాగించారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసిఆర్ పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండి తెలంగాన రైతుల అభివృద్ది కోసం పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి తమ్మిడి హట్టి బ్యారేజి నిర్మాణంకు 148 మీటర్లకు ఒప్పందం కుదుర్చుకొని వస్తే 65 సంవత్సరాలు అధికారంలో ఉండి బ్యారేజీ నిర్మాణం జరుపక ఆంధ్రా పాలకుల కను సన్నల్లో పనిచేసిన నాయకులు నేడు అవాకులు చెవాకులు పేలటం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

నరుూం డాక్యుమెంట్లపై ఏపిలో సోదాలు
మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 26: మిర్యాలగూడ హౌసింగ్‌బోర్డు కాలనీలోని నరుూం అత్తా సుల్తానా ఇంట్లో లభించిన సుమారు 240 ఆస్తుల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, అదే విధంగా నల్లగొండలో అరెస్టు అయిన డ్రైవర్ మసూద్‌అలి వద్ద లభించిన 4 డాక్యుమెంట్ల ఆధారంగా సిట్, మిర్యాలగూడ పోలీసులు ఆంధ్రాలో సోదాలు చేస్తున్నారు. డాక్యుమెంట్లన్నీ నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించినవని అధికారులు అంటున్నారు. సిట్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్, మిర్యాలగూడ ఒన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ డి.బిక్షపతి శుక్రవారం నెల్లూరు పట్టణంలోని కొన్ని అపార్ట్‌మెంట్లలో ఉన్న నరుూం అనుచరుల ఇళ్లలో సోదాలు, బాధితుల ఇళ్లల్లో విచారణ జరిపారు. మిర్యాలగూడ ఒన్‌టౌన్ నుండి ఒక హెడ్‌కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుల్స్, సిట్ ఇన్‌స్పెక్టర్‌ల బృందం గురవారం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి ముందుగా నెల్లూరులో సోదాలు చేసింది. అక్కడ నుండి ఒంగోలు, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం కూడ వెళ్లనున్నట్టు అధికారుల ద్వారా తెలిసింది. మొత్తం మీద విచారణను వేగవంతం చేశారు.

తెరాసలో వందలాది నరుూంలు
ఎమ్మెల్సీ కోమటిరెడ్డి ధ్వజం
నాంపల్లి, ఆగస్టు 26: తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ఆస్తులు, డాక్యుమెంట్లు సంపాదించిన నరుూంను పెంచి పోషించి హతం చేసి టిఆర్‌ఎస్‌లో వంద మంది నరుూంలను తయారు చేసిందని నల్లగొండ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నాంపల్లిలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో నరుూం 20వేల కోట్ల రూపాయలు పోగు చేశాడని, అతన్ని హతం చేసి అట్టి డబ్బును టిఆర్‌ఎస్ నాయకులు వారి స్వలాభాల కోసం ఉపయోగించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. నరుూం వ్యవహారాలపై సిబిఐ విచారణ జరగాలని.. అతని వెంట ఉన్న 200 మంది అనుచరులను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే టిఆర్‌ఎస్ ప్రభుత్వం మాటల గారడీతో ప్రజలను మభ్యపెడుతుందని, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, రుణమాఫీ మిషన్ భగీరథ, వాటర్ గ్రిడ్ వంటి పథకాలు చేపట్టి వేల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తుందని మండి పడ్డారు. సిట్ రాష్ట్ర కమిటీలో టిఆర్‌ఎస్ నాయకుల పేర్లు ఉన్నా ప్రభుత్వం అరెస్టు చేయకపోవడం శోచనీయమన్నారు. అలాగే, 15వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ సోనియాగాంధీని కేసిఆర్ విమర్శించడం సిగ్గుచేటని, ప్రాజెక్టుల పేరిట డిజైన్లు మార్చి వేల కోట్ల రూపాయలను కుటుంబం మొత్తం దోచుకుంటుందని ఎద్దేవా చేశారు.