తెలంగాణ

నాగార్జునసాగర్ ఆయకట్టులో మేజర్ కాల్వలకు నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 26: నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టులోని 49 మేజర్ కాల్వలకు నీటివిడుదల అధికారులు, సిబ్బంది శుక్రవారం సాయంత్రం నుండి ప్రారంభించారు. సాగర్ ఎడమ కాల్వ నుండి శుక్రవారం ఉదయం 7,100 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండగా కాల్వ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయిన పెద్దదేవులపల్లిలో కనిష్ట నీటి మట్టం 6 అడుగులుండగా మద్యాహ్నం కల్లా 11 అడుగులకు చేరుకుంది. సాయంత్రానికి నీటివిడుదల 8వేల క్యూసెక్కులకు పెంచారు. 15 అడుగులకు కనిష్ట నీటి మట్టం చేరుకోగానే రిజర్వాయర్ దిగువనున్న మేజర్ కాల్వలకు నీటి విడుదలను శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఎన్‌ఎస్‌పి ఒ అండ్ ఎం అధికారులు కాల్వలకు డిజైన్ డిశ్చార్జి ప్రకారం నల్లగొండ జిల్లాలోని 49 మేజర్ కాల్వలకు ఆరు విడతల్లో ఆరుతడి పద్దతిన నీటిని విడుదల చేయాలని మానిటోరింగ్ అధికారులను కోరారు. సాగర్ ఎడమ కాల్వకు 25 నుండి పది రోజుల పాటు సెప్టెంబర్ 3 వరకు 8వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తారని, అన్ని మేజర్‌లకు డిజైన్ డిశ్చార్జి ప్రకారం నీటి విడుదలకై తడకమళ్ల క్రాస్ రెగ్యులేటర్ కిందికి దింపుతారని, అదే విధంగా మునగాల క్రాస్ రెగ్యులేటర్ కిందికి దింపి ముక్త్యాల బ్రాంచి కాల్వకు నీరు విడుదల చేస్తారని అధికారులు తెలిపారు.

25 నుండి సెప్టెంబర్ 3 వరకు 10 రోజుల పాటు 8,000 క్యూసెక్కులు మొత్తం 6.92 టిఎంసిల నీరు, తిరిగి సెప్టెంబర్ 11 నుండి 18 రోజుల వరకు 3.48 టిఎంసిలు, 26 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 2 వరకు ఐదువేల క్యూసెక్కులు 3.48 టిఎంసిలు, 11అక్టోబర్ నుండి 18 వరకు 6,000 క్యూసెక్కులు 4.18 టిఎంసిలు, అక్టోబర్ 26 నుండి నవంబర్ 2 వరకు 7,000 క్యూసెక్కులు 4.87 టిఎంసిలు, 10 నవంబర్ నుండి 17 వరకు 5,000 క్యూసెక్కులు 3.48 టిఎంసిల నీరు విడుదల చేస్తారని అధికారులు పేర్కొన్నారు.
అదే విధంగా ప్రధాన కాల్వపై పోలీస్ పెట్రోలింగ్ కూడ ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. నీటిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.