తెలంగాణ

బెదిరింపులతో ప్రభుత్వాలు నడవవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 27: పార్టీ మారిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందని బిజెపి నేత జి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో బిజెపి పక్ష కార్యాలయంలో పార్టీ సభా నాయకుడిగా కిషన్‌రెడ్డి శనివారం నాడు బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన గణపతి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి టిఆర్‌ఎస్ పాలనపై నిప్పులు చేరిగారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిఎంగా ప్రమాణ చేసినప్పుడు రాజ్యాంగాన్ని గౌరవిస్తానని కెసిఆర్ హామీ ఇచ్చారని కిషన్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగంలో పార్టీ ఫిరాయింపుల చట్టం ఉందని, దానిని ఉల్లంఘించవద్దని ఆయన వ్యాఖ్యానించారు. చట్టాలను మనమే అతిక్రమించడం సరికాదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం బెదిరించే ధోరణులకు దిగుతోందని, బెదిరింపులతో ప్రభుత్వాలు నడవవని అన్నారు. రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో ఉందని అన్నారు. ప్రతి పక్షాలు చేస్తున్న ఆరోపణలపై శాసనసభలో చర్చించాల్సి ఉందని ఆయన సూచించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత శాసనసభ సమావేశాలు తూతూ మంత్రంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. జిల్లాల విభజన కూడా సిఎం ఇష్టానుసారం చేశారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె .లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి తదితరులు ఆయనను అభినందించారు.
మజ్లిస్ దోస్తీకి ప్రాధాన్యతా: లక్ష్మణ్
ముఖ్యమంత్రి తెలంగాణ విమోచనాదినోత్సవాన్ని నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇస్తారా లేదా మజ్లిస్ పార్టీ దోస్తీకి ప్రాధాన్యత ఇస్తారా అనేది స్పష్టం చేయాలని డాక్టర్ కె లక్ష్మణ్ నిలదీశారు. శనివారం నాడు పార్టీ రాష్టక్రార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడుతూ 17న వరంగల్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం జరుగుతుందని, దానికి అమిత్ షా హాజరవుతారని చెప్పారు. మహిళా మోర్చా అధ్యక్షురాలు పద్మజారెడ్డి మాట్లాడుతూ తిరంగా యాత్రను తెలంగాణలో దిగ్విజయం చేస్తామని చెప్పారు.