తెలంగాణ

ప్రాజెక్టులపై వారికి అవగాహన లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 27: రాష్ట్రంలోని ప్రాజెక్టులపై విపక్షాలకు కనీస అవగాహన లేదని టిఆర్‌ఎస్ ఎంపి కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ భవన్‌లో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. మహారాష్టత్రో 152 మీటర్లకు ఒప్పందం జరగలేదని ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి హుందాగా అంగీకరించారని, రాజకీయాలకు అతీతంగా మాట్లాడి పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారని అన్నారు. మిగిలిన కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి బాటలో నడిస్తే బాగుంటుందని అన్నారు. 1975లోనే ఒప్పందాలు జరిగాయని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు ఇంత కాలం అధికారంలో ఉండి ప్రాజెక్టులు ఎందుకు నిర్మించలేదని అన్నారు. టిడిపి నేతలు రేవంత్‌రెడ్డి, రమణలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. వర్క్ లేని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్‌రెడ్డి మిగిలిపోయారని అన్నారు. రేవంత్‌రెడ్డి, రమణ ఆంధ్ర ప్రయోజనాలను పక్కన పెట్టి తెలంగాణ గురించి ఆలోచించాలని అన్నారు. మేడిగడ్డ మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో ఉంటుందని, మహారాష్టల్రో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతాయని అందుకే ఆ రాష్ట్రంతో ఒప్పందం చేసుకొన్నట్టు చెప్పారు. బిజెపి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం లేదా మరో ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చేట్టు చేయాలని అన్నారు. జిల్లాల విభజన శాస్ర్తియంగానే జరుగుతోందని కవిత తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని చెప్పారు.

చిత్రం.. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపి కవిత