తెలంగాణ

సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్న ఎస్‌ఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి, జనవరి 8: గడువు ముగియకుండానే బదిలీ చేయడంపై మనస్థాపానికి గురైన పెద్దపల్లి ఎస్‌ఐ జగన్‌మోహన్ శుక్రవారం రాత్రి తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పోలీస్ శాఖలో కలకలం రేపింది. 2007 బ్యాచ్‌కు చెందిన జగన్‌మోహన్ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్‌లలో పనిచేసి ఏడాది క్రితం పెద్దపల్లి ఎస్‌ఐగా బదిలీపై వచ్చాడు. అయితే ఏడాది తిరగకముందే జగన్‌మోహన్‌ను ఇటీవల జరిగిన బదిలీల్లో జమ్మికుంటకు బదిలీ చేశారు. దీంతో మనస్థాపానికి గురైన జగన్‌మోహన్ ఈ దుర్ఘటనకు పాల్పడినట్టు కుటుంబీకులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న ఎస్పీ డి జోయల్ డేవిస్ హుటాహుటిన పెద్దపల్లికి చేరుకొని మృతదేహాన్ని సందర్శించారు. ఈ సంఘటనతో పెద్దపల్లి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ అధికారులు బందోబస్తు చర్యలు చేపట్టారు.

చిత్రం... ఆత్మహత్యకు పాల్పడిన
ఎస్‌ఐ జగన్‌మోహన్