తెలంగాణ

కాశ్మీర్‌లో శాంతి కోసం అన్ని వర్గాలతో చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 27: కాశ్మీర్‌లో శాంతి నెలకొనడానికి అన్ని వర్గాల వారితో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. 50 రోజులుగా కాశ్మీర్‌లో కర్ఫ్యూ కొనసాగడం పట్ల ఆయన శనివారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. కాశ్మీర్‌లో పరిస్థితులు చేయి దాటిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ప్రజలు మరణిస్తున్నా, భద్రతా బలగాలు బలవుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన మండిపడ్డారు. అక్కడ శాంతి నెలకొనేందుకు ఎవరు చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలూ విశ్వాసాన్ని కోల్పోతున్నాయని, వేర్పాటువాదులు కూడా ధైర్యాన్ని కోల్పోతున్నారని ఆయన తెలిపారు. వేర్పాటువాదులను హౌస్ అరెస్టు చేయడం, చర్చలకు చొరవ చూపకపోవడం దారుణమని అన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నదని ఆయన చెప్పారు.