తెలంగాణ

మంత్రి పోచారం నేతృత్వంలో అమెరికాకు వ్యవసాయ బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 27: వ్యవసాయ పరికరాలు, ఉత్పత్తుల ఎగ్జిబిషన్ తిలకించడంతో పాటు, అంతర్జాతీయ వ్యవసాయ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో ఉన్నతస్థాయి బృందం అమెరికా వెళుతోంది. మంత్రివెంట కరీంనగర్ ఎంపి బి. వినోద్‌కుమార్, వ్యవసాయ కార్యదర్శి సి. పార్థసారథి, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండి మురళి తదితరులు వెళుతున్నారు. ఈ నెల 30-31, సెప్టెంబర్ 1 వ తేదీల్లో ఈ బృందం అమెరికాలో పర్యటిస్తుంది. అమెరికాలోని ఐఓవాప్రాంతంలోని బూనేపట్టణంలో మూడు రోజులు జరిగే వ్యవసాయ ప్రదర్శన, అంతర్జాతీయ సమావేశంలో ఈ బృందం పాల్గొంటుంది.
ఫీజుల బకాయిలు విడుదల చేయాలి
బిసి సంక్షేమ సంఘం డిమాండ్
హైదరాబాద్, ఆగస్టు 27: ఫీజుల బకాయిలు 1800 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్. కృష్ణయ్య శనివారం రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. గత ఏడాది మార్చిలో ముఖ్యమంత్రి కెసిఆర్ రెండు సంవత్సరాల ఫీజుల బకాయిలు మొత్తం 3140 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారని, ఆ తర్వాత జివో కూడా జారీ చేశారని ఆయన తెలిపారు. అయితే నెలలోపు బకాయిలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించి ఆరు నెలలైనా ఇంత వరకు 1200 కోట్లు మాత్రమే విడుదల చేశారని ఆయన వివరించారు. పైగా మంజూరు చేసిన ఫీజులు/స్కాలర్‌షిప్‌పల బిల్లులు ట్రెజరీలో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ట్రెజరీలో పాసైనవి కూడా బ్యాంకులో నిలిపి వేశారని, దీంతో చదువు పూర్తయిన విద్యార్థుల సర్ట్ఫికేట్లు కళాశాలల యజమాన్యాలు ఇవ్వడం లేదని ఆయన తెలిపారు. ఫీజు చెల్లించి సర్ట్ఫికేట్లు తీసుకెళ్ళాలంటూ కళాశాలల యజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నారని ఆయన వివరించారు.
ఆరోగ్య శాఖను బలోపేతం చేస్తాం
రాష్టవ్య్రాప్తంగా 40 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు : మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి
సికింద్రాబాద్, ఆగస్టు 27:తెలంగాణలో ఆరోగ్యశాఖను మరింత బలోపేతం చేసే దిశగా సిఎం కృషి చేస్తున్నారని వైద్య ఆరోగ్యశాఖామంత్రి డాక్టర్.సి.లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన గాంధీ ఆసుపత్రిలో మంత్రి తలసానితో కలిసి కొత్తగా ఏర్పాటుచేసిన బెడ్‌లను వారు ప్రారభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలని, సిబ్బందిని పెంచాలని సిఎం ఆదేశాలనుసారంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఇందుకు అనుగుణంగా ఈ సారి బడ్జెట్‌లో కేటాయింపులు కూడ అధికంగా ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే విరిగిపోయిన కుర్చీలు, వంగిపోయిన మంచాలు, పూర్తి శిథిలావస్థకు చేరుకున్న పరికరాలు, అపరిశుభ్రవాతావరణం కనిపించేవని అన్నారు. ఈ పరిస్థితి నుంచి పూర్తి భిన్నమైన వాతావరణం ప్రస్తుతం చోటు చేసుకుంటుందని మంత్రి తెలిపారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 18వేల బెడ్‌లు ఉంటే అందులో 12వేలు కొత్తవాటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో బాగంగానే గాంధీ ఆసుపత్రిలో 250 ఆర్థ్రోపెడిక్ వార్డులో, 100 చిన్నపిల్లల విభాగంలో ఏర్పాటు చేశామన్నారు. ఇంకా అవసరమైతే ఇంకా పెంచనున్నామని కార్పోరేట్ అసుపత్రులకు ధీటుగా పరికరాలను బెడ్‌లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు. కాగా ప్రతిరోజు బెడ్‌షీట్‌లు మార్చాలని, ఇందుకు కొన్ని ఆసుపత్రుల్లో ఏడు కలర్‌లు గాంధీలో రెండుకలర్‌లు ఏర్పాటు చేశామని ఏరోజుకారోజు బెడ్‌షీట్‌లు మార్చకపోతే రోగులు ఫిర్యాదులు చేయాలని సూచించారు. కొత్తగా టాయిలెట్స్ ఏర్పాటు చేశామని, లిఫ్ట్‌లు కూడ కొత్తవాటిని ఏర్పాటు చేయడం జరిగిందని, కొంత సమయం పడుతుందని, పూర్తిగా గాంధీ ఆసుపత్రిని అధునాతనంగా మార్చడంతోపాటు పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక సిబ్బంది కొరత అధికంగా ఉందని, ఆసుపత్రిలో ఉన్న ఖాళీలకు తోడు మరికొన్నింటిని త్వరలోనే భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. నానాటికి పెరుగుతున్న రోగులకు అనుగుణంగా సిబ్బందిని పెంచాల్సి ఉందన్నారు. ఇప్పటికే 2,118 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చిందని, అదనంగా మరో నాలుగు వేల పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే ఈ ఇబ్బందులను అధిగమిస్తామన్నారు. కొత్తగా అన్ని జిల్లా ఏరియా ఆసుపత్రుల్లో 40డయాలసిస్ సెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నామని, ప్రైమరీ హెల్త్‌సెంటర్‌ల నుంచి ఏరియా ఆసుపత్రుల వరకు బలోపేతం చేస్తున్నామని అవసరమైనచోట ఐసియులను కూడ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో లైవ్ లివర్ ట్రాన్స్‌ఫ్లాన్‌టేషన్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ఇప్పటి వరకు చనిపోయిన వారి నుంచి మాత్రమే లివర్ ట్రాన్స్‌ఫ్లాన్‌టేషన్ నిర్వహించామని ఇక నుంచి కొత్తవిధానాన్ని కూడ అధునాతన పద్దతిలో అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.
‘ఆయుష్‌కి తోడ్పాటు’
సికింద్రాబాద్, ఆగస్టు 27: తెలంగాణలో ఆయుష్ వైద్యానికి సర్కార్ తగిన ప్రోత్సాహం కల్పిస్తుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్.సి.లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శనివారం తార్నాకలోని ఐఐసిటి ఆడిటోరియంలో ‘సీర్’2016 మొదటి మెడికల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఆయుష్ వైద్యవిధానానికి కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుందని అన్నారు. గతంలో జరిగిన విధంగా కాకుండా ఆలోపతి వైద్యంతోపాటు ఆయుష్‌కు కూడ మంచి ప్రోత్సాహం కల్పించి ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం కృషి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలలో 20 బెడ్‌ల ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటుతోపాటు డిస్పెన్సరీలలో ప్రత్యేకమైన సదుపాయాలు కూడా కల్పించాలని సంకల్పించామన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆయుష్ విభాగాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి వెల్లడించారు. చార్మినార్ యునాని ఆసుపత్రిని సందర్శించినప్పుడు అక్కడ ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసిన తర్వాత వెంటనే మరిన్ని సదుపాయాలను కల్పించడం జరిగిందని చెప్పారు. ఆయుష్ వైద్యంతోపాటు నేచర్‌క్యూర్‌పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, అనంతగిరిలో ఓ ఆసుపత్రిని ప్రారంభిస్తున్నామని మంత్రి వెల్లడించారు. వైద్యులు కూడ తమ వంతు కర్తవ్యంగా సాంప్రదాయ వైద్యవిధానాలను మరింత మెరుగుపర్చుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేశ్ తివారి, వైద్యవిధాన పరిషత్ కమీషనర్ డాక్టర్ రమణి, పబ్లిక్‌హెల్త్ డైరక్టర్ డాక్టర్ లలితకుమారి, కాళోజీనారాయణరావుహెల్త్‌సైనె్సస్ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.