తెలంగాణ

జనగామ జిల్లాకే కెసిఆర్ ఓటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగస్టు, 27: పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన తెరపైకి తెచ్చింది. జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుండి ఎలాంటి డిమాండ్ లేకున్నా హన్మకొండ జిల్లా ఏర్పాటుకు ముసాయిదాలో చోటుదక్కడం, ప్రజలు, ప్రజాప్రతినిధుల నుండి జనగామ జిల్లా ఏర్పాటు బలంగా ఉన్నా ముసాయిదాలో చోటు దక్కకపోవడం పట్ల ప్రజల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేకంగా హన్మకొండ విషయంలో సిఎం కెసిఆర్ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో రెండవ అతిపెద్ద నగరంగా ఉండి, చారిత్రక నేపథ్యం ఉన్న వరంగల్‌ను విడదీసి రాజకీయ ప్రయోజనాల కోసం హన్మకొండ జిల్లా ఏర్పాటు ప్రతిపాదన చేసారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలు బలంగా కోరుకుంటున్న జనగామ జిల్లా ఏర్పాటును సిఎం పట్టించుకోపోవడం వెనుక అంతర్యమేమిటనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని జిల్లాల ఏర్పాటుకోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్, స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, జడ్పీ చైర్‌పర్సన్ గద్దెల పద్మ మూకుమ్మడిగా లేఖలు అందజేసారు. అంతే కాకుండా ఇలాంటి అంశాలు ప్రతిపక్షాలకు కూడా విమర్శనాస్త్రాలుగా మారడంతో సిఎం ఈ రెండు జిల్లాల విషయంలో మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలిసింది. ప్రజలతో పాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎంపిలు సైతం వ్యతిరేకిస్తుండడంతో ముఖ్యమంత్రి జనగామ, హన్మకొండ జిల్లాల ఏర్పాటు విషయంలో దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఇప్పటికే ఈ రెండు జిల్లాల ఏర్పాటుపై కెసిఆర్ ఇంటెలిజెన్స్ వర్గాలతో ప్రత్యేకంగా నివేదిక తెప్పించుకున్నట్టు తెలిసింది. కొత్తగా ప్రతిపాదించిన హన్మకొండ జిల్లాను రద్దు చేసి హన్మకొండ జిల్లాలో ప్రతిపాదించిన పాలకుర్తి, స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గాలను కొత్తగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న జనగామ ప్రతిపాదిత జిల్లాలో కలిపే యోచనలో సిఎం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. వరంగల్‌ను నాలుగు జిల్లాలుగా చేయాలని భావించిన ప్రభుత్వానికి ప్రతిపాదిత భూపాల్‌పల్లి, మహాబూబాబాద్ జిల్లాల నుండి పెద్దగా ఎలాంటి అభ్యంతరాలు రావడం లేదు. కేవలం హన్మకొండ , జనగామ నుండి ప్రజల నుండి నిరసనలు వస్తుండడంతో పాటు ఈనెల 30న ఈ రెండు జిల్లాలపైనే వరంగల్ జిల్లాకు అఖిలపక్షం బంద్ పిలుపుఇచ్చిన నేపథ్యంలో హన్మకొండ జిల్లాకు బదులు జనగామ జిల్లా చేసే విధంగా సిఎం ఆలోచిస్తున్నారని అధికార పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి తెలిపారు. అందులో భాగంగానే వరంగల్‌లో ఎమ్మెల్యేలు, నగర మేయర్, ఎంపిలు హన్మకొండ జిల్లాకు వ్యతిరేకంగా గళం విప్పడం వెనుక సిఎం అనుమతి ఉన్నట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ హన్మకొండ జిల్లా ప్రతిపాదన రద్దు కావడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో దీంతో ప్రత్యామ్నాయంగా జనగామ జిల్లా కూడా అనివార్యం కనిపిస్తోంది.