తెలంగాణ

బాలభీముడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లింగాల, ఆగస్టు 27: మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం ఒక బాలుడు ఏకంగా నాలుగున్నర కిలోల బరువుతో జన్మించాడని ఎస్పీహెచ్‌ఓ డాక్టర్ అల్లె శ్రీనివాసులు తెలిపారు. బల్మూర్ మండలం అనంతవరం గ్రామానికి చెందిన బాలమణి సిజేరిన్ ఆపరేషన్ చేయగా, అధిక బరువుతో ఈ బాలుడు జన్మించాడు. దీంతో తల్లిదండ్రులు రాంబాబు, బాలమణి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆస్పత్రిలో పండుగ వాతావరణం నెలకొంది. శనివారం ఈ ఆస్పత్రిలో 8 సిజేరిన్, ఏడు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలను నిర్వహించినట్లు ఎస్పీహెచ్‌ఓ తెలిపారు.