తెలంగాణ

ఎక్స్ అఫీషియోలే సగం బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యులు కీలకపాత్ర వహించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్ జిల్లాతోపాటు రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని కొంతభాగం కూడా ఉంది. ఈ మూడు జిల్లాల పరిధిలోని ప్రజాప్రతినిధులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎక్స్ అఫీషియో సభ్యులు. మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా 60మంది ప్రజా ప్రతినిధులకు ఓటు హక్కు ఉంటుంది. 150మంది వార్డు సభ్యులతోపాటు 60 మందీ మేయర్ ఎన్నికకు ఓటేస్తారు. మ్యాజిక్ ఫిగర్ 105 ఎవరికి వస్తే వారిదే మేయర్ స్థానం. ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లతో సంబంధం లేకుండా 150 వార్డుల్లో మెజారిటీ స్థానాలు సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని తెరాస ధీమా వ్యక్తం చేస్తోంది. ఒకవైపు మెజారిటీ స్థానాల్లో విజయానికి తీవ్రంగా ప్రయత్నిస్తూనే, మరోవైపు అవసరమైతే ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటుబలంతో మేయర్ పీఠం కైవసం చేసుకోవడానికి తెరాస వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్, సికిందరాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, మెదక్ నియోజక వర్గం ఎంపీలు ఐదుగురూ ఎక్స్ అఫీషియో సభ్యులే. ఐదుగురు ఎంపీల్లో చేవెళ్ల, మెదక్ ఎంపీలు మాత్రమే తెరాసకాగా, హైదరాబాద్‌లో ఎంఐఎం, సికిందరాబాద్‌లో బిజెపి ఎంపీలున్నారు. మల్కాజిగిరిలో తెదేపా గెలిచింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా 60మంది ఎక్స్ అఫీషియో సభ్యుల్లో 40మంది తెరాసకు చెందినవారే ఉన్నారు. మిగిలిన 20మంది ఎంఐఎం, తెదేపా, భాజపా పార్టీలకు చెందిన వారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే తెరాస వ్యూహాత్మకంగా నగరానికి చెందిన తెదేపా ఎమ్మెల్యేలను తెరాసలోకి చేర్చుకుంది. ‘వార్డుల్లో మెజారిటీ స్థానాలు సాధిస్తాం. ఒకవేళ ఏదైనా తేడావచ్చినా ఎక్స్ అఫీషియో సభ్యుల్లో ఎక్కువమంది తెరాసకు చెందిన వారే ఉన్నారు. కాబట్టి మేయర్ స్థానం కైవసం చేసుకోవడంలో ఎలాంటి అనుమానం లేదు’ అని తెరాస వర్గాలు చెబుతున్నాయి.
40మంది ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు మావద్ద ఉన్నాయి. మేయర్ స్థానం కోసం మాకు ఇంకా కావాల్సింది 65 ఓట్లు. కానీ ఇతర పార్టీలకు ఇలాంటి సౌకర్యం లేదు అని తెరాస నాయకులు గుర్తు చేస్తున్నారు. 20మంది ఎక్స్ అఫీషియో సభ్యుల్లో ఎనిమిది మంది ఎంఐఎంకు చెందిన వారున్నారు. సొంతంగా మేయర్ పదవి చేపట్టాలంటే ఎంఐఎం 150 వార్డుల్లో 97 స్థానాలు గెలవాలి. ఇక తెదేపా -్భజపాకు 12 ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. వార్డుల్లో సొంతంగా 93 స్థానాల్లో విజయం సాధిస్తే భాజపా- తెదేపా కూటమికి మేయర్ స్థానం దక్కుతుంది. ఇటీవల నిర్వహించిన పలు సర్వేల్లో 80 స్థానాల వరకూ తెరాసకు దక్కుతాయని తేలింది. మేం వందస్థానాల్లో గెలుస్తాం అని తెరాస నేతలు చెబుతున్నా, 150 స్థానాల్లో సగం స్థానాలు గెలిచి తీరుతామని అంచనా వేస్తున్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులకు ఓటు హక్కు ఉండటంతో మేయర్ ఎన్నిక ఆసక్తికరంగా మారనుంది. బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లతో అధికారపక్షం మేయర్ స్థానాన్ని దక్కించుకున్న విషయం ఇక్కడ గమనార్హం.