తెలంగాణ

కార్గిల్ అమరులకు దత్తాత్రేయ నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: మాజీ సైనికోద్యోగుల సంక్షేమం గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. సికింద్రాబాద్‌లోని కార్గిల్ స్మారక స్థూపం వద్ద ఆదివారం అమరులకు ఆయన నివాళి అర్పించారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తిరంగా ఉత్సవాలు నిర్వహించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన ఒక కార్యక్రమంలో దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అఫ్గనిస్తాన్, భారత్‌లో అల్లకల్లోలాలు సృష్టించి అశాంతి కల్పించాలని ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. మాజీ సైనికోద్యోగుల సంక్షేమం, పెన్షన్ల కోసం 10 వేల కోట్ల రూపాయలను ప్రధాని విడుదల చేశారన్నారు. దీని వల్ల 20 లక్షల పెన్షన్‌దారులకు లబ్ది చేకూరిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మాజీ సైనికోద్యోగుల సంక్షేమం పట్ల దృష్టి సారించాలని, ఇళ్ల పట్టాలు, భూమి, రుణాలు ఇవ్వాలని ఆయన సూచించారు. రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రసంగిస్తూ దేశ సరిహద్దుల్లో, అతి భయానక వాతావరణంలో జవానులు దేశ రక్షణ కోసం నిలబడడాన్ని మరిచిపోరాదని అన్నారు.