తెలంగాణ

యాదాద్రికి జనగామ సెగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఆగస్టు 28: జిల్లాల పునర్ వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రతిపాదించిన యాదాద్రి జిల్లా ఏర్పాటుకు జనగామ జిల్లా డిమాండ్ సెగలు సమస్యగా మారుతున్నాయి. ప్రజల నిరసనలకు స్పందించి ప్రభుత్వం కొత్త జిల్లా హన్మకొండకు బదులుగా జనగామ జిల్లాను ప్రతిపాదిస్తే అప్పుడు యాదాద్రి జిల్లా భవితవ్యం ఏమిటి.. యాదాద్రి జిల్లా ప్రతిపాదనల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయన్నదీ ఆసక్తికరంగా మారింది. ముసాయిదా ప్రతిపాదనల మేరకు నల్లగొండ జిల్లాను మూడు జిల్లాలుగా పునర్ వ్యవస్థీకరణ చేస్తు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలను ప్రతిపాదించారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లా ల ఏర్పాటుకు సంబంధించి పెద్దగా నిరసనలు, అభ్యంతరాలు వ్యక్తం కావడం లేదు. అయితే రెవెన్యూ డివిజన్లు, మండలాల కూర్పులో మాత్రం కొంత భిన్నాభిప్రాయలు వినిపిస్తున్నా అవి పెద్దగా నిరసన రూపాలు దాల్చ డం లేదు. ఇకపోతే యాదాద్రి జిల్లాకు సంబంధించి మాత్రం మొద టి నుండి కూడా జనగామ డివిజన్ వాసుల నుండి తీవ్ర వ్యతిరేకతలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. యాదాద్రిలో జనగామ డివిజన్ మండలాలను కలపవద్దని, తమకు జనగామ పేరుతో ప్రత్యేక జిల్లా కావాలంటు రోజురోజుకూ ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. అఖిల పక్షాల నీడన సాగుతున్న జనగామ జిల్లా ఆందోళనల్లో ప్రజలు సమరోత్సాహంతో భాగస్వామలవుతున్నారు. దీంతో అక్కడి టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు సైతం జనగామ ప్రజలు ప్రత్యే క జిల్లా కోరుకుంటున్నారని అం దుకు చర్యలు తీసుకోవాలని సిఎం కెసిఆర్‌కు నివేదించుకుంటున్నారు. సిఎం కెసిఆర్ వరంగల్ జిల్లా పునర్ వ్యవస్థీకరణలో హన్మకొండకు బదులుగా జనగామ జిల్లా ఏర్పాటు ప్రతిపాదనలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యాదా ద్రి జిల్లా ఏర్పాటు ప్రతిపాదనల్లో ఎలాం టి మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయోనన్న ఉత్కంఠ ప్రతిపాదిత నల్లగొండ జిల్లా పరిధిలోని యాదాద్రి వాసుల్లో ఆసక్తిని రేకేత్తిస్తోంది.
యాదాద్రిలో మండలాల
సంఖ్య తగ్గేనా..!
ప్రస్తుతం నల్లగొండ జిల్లా పునర్ వ్యవస్థీకరణలో నల్లగొండ జిల్లాను 31 మండలాలతో, సూర్యాపేట, యాదా ద్రి జిల్లాలను 20 మండలాల చొప్పు న ప్రతిపాదించారు. అయితే యాదాద్రిలో కలవబోమని ప్రత్యేక జిల్లా కావాలంటున్న జనగామ వాసు ల డిమాండ్‌కు ప్రభుత్వం తలొగ్గి హన్మకొండ స్థానంలో జనగామ జిల్లా ఏర్పాటు చేసిన పక్షంలో ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో ప్రతిపాదించిన జనగామ, బచ్చన్నపేట, లింగాల ఘనపూర్, దేవరుప్పల మండలాలు యాదాద్రి జిల్లా నుండి దూరంకాక తప్పదు. అదే జరిగితే యాదాద్రి జిల్లా 16 మండలాలకే పరిమితం కానుంది.
అలాంటప్పుడు సరిహద్దు ల్లోని సూర్యాపేట, నల్లగొండ, సిద్దిపేట, మల్కాజిగిరి, హన్మకొండ జిల్లాల నుండి ఏమైనా మండలాలను చేరుస్తారా లేక 16 జిల్లాలతోనే యాదాద్రి జిల్లాను ఏర్పాటు చేస్తారా అన్నదీ చర్చనీయాంశమైంది. కాగా, జనగామ జిల్లా ఏర్పాటు చేసిన పక్షంలో భువనగిరి డివిజన్ పరిధి నుండి కొత్తగా జనగామ రెవెన్యూ డివిజన్‌లో కలిపిన రాజాపేట, గుం డాల, ఆలేరు మండలాల ప్రజలు తమను తిరిగి భువనగిరి డివిజన్‌లో కొనసాగించాలన్న వాదన వినిపించవచ్చు. మరోవైపు నల్లగొండ జిల్లా పరిధిలో ఉన్న డిండి జిల్లా కేంద్రానికి 100 కిలోమీటర్ల దూరం ఉన్నందున తమను నాగర్‌కర్నూల్ జిల్లాలో కలపాలన్న డిమాండ్ లేవెనెత్తుతున్నారు.

చిత్రం.. యాదాద్రి జిల్లా మ్యాప్