తెలంగాణ

1969 ఉద్యమకారుడికి రూ. 10 లక్షల సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 29: తెలంగాణ ఉద్యమంలో (1969) పోలీస్ కాల్పుల్లో గాయపడిన హైదరాబాద్ నగరానికి చెందిన పగడాల పరంధామకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. సికింద్రాబాద్ జనరల్ బజార్‌లో జరిగిన పోలీస్ కాల్పుల్లో పరంధామకు ఛాతిలో, కుడికాలుకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతుండగా, కుమారుడు కూడా ఒక ప్రమాదంలో మృతి చెందాడు. ఇటీవల ముఖ్యమంత్రిని పరంధామ కలిసి తన దీనస్థితిని వివరించారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి ఆయనకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ మొత్తాన్ని వెంటనే అందజేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.