తెలంగాణ

పోలీసులపై కాల్పుల ఘటనలో ఐదుగురి రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిగి, ఆగస్టు 29: దొంగతనానికి వచ్చి అర్ధరాత్రి పెట్రోలింగ్ చేస్తున్న ట్రేనీ ఎస్‌ఐ, సిబ్బందిపై కాల్పులు జరిపిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఐదుగురిని రిమాండ్‌కు తరలించామని చేవెళ్ల డిఎస్పీ శృతికీర్తి తెలిపారు. సోమవారం పరిగి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గతనెల 16 తేది అర్ధరాత్రి కర్నాటక రాష్ట్రం గుల్బార్గకు చెందిన నలుగురు వ్యక్తులు పరిగిలో దొంగతనం చేసేందుకు వచ్చారు. పెట్రోలింగ్‌లోట్రేనీ ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రవీందర్, డ్రైవర్ మల్లేష్ విధులు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి వచ్చిన వ్యక్తులు పరిగి పట్టణంలో కారును నడుపుతున్న తీరు పోలీసులకు అనుమానం కలిగించింది. ఆ కారును పోలీస్ వాహనం వెంబడించింది. టెలిఫోన్ ఎక్సైంజ్ దగ్గర వారిని ఆపి గొడవపడి వారిని పట్టుకున్నారు. కర్నాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన మాన్‌సింగ్, మతీన్‌మార్థు, గిరి, సమద్, గిరి.. ఐదు సంవత్సరాలుగా దొంతనాలు చేస్తున్నారు. సాయంత్రం పూట ఇంటి నుంచి కారులో బయలుదేరి రాత్రిపూట ఇంటికి తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంచుకుని దొంగతనాలు చేస్తుంటారు. ఇప్పటి వరకు సంగారెడ్డిలో రెండు కేసులు, తాండూరులో రెండు కేసులు, షాద్‌నగర్‌లో మూడు కేసులు, మంత్రాలయంలో, కోడంగల్, కర్నాటక ఓపిస్‌పేట్‌లో, కర్నూల్‌లో, ఎల్‌బినగర్‌లో దొంగతనాలు నిర్వహించారు. వీరిపై గతంలో 19 కేసులు ఉన్నాయి. 50 తులాల బంగారం దొంగలించారు. వీరు దొంగలించిన బంగరాన్ని విక్రయించేందుకు కర్నాటకకు చెందిన వీరన్నగౌడ్ మధ్యవర్తిగా పని చేస్తున్నాడు. వీరు దొంగలించిన బంగారాన్ని శివానంద్, గిరి, మతూస్ మీర్జ, బాలాజీ కధన్ బంగారం షాపులలో అమ్ముతారు. వీరి నుంచి 14.5తులాల బంగారం, 12 తులాల వెండిని రికవరీ చేశామని డిఎస్పీ తెలిపారు. ఓ రివాల్వర్ ఆరు బుల్లెట్‌లను స్వాధీనం చేసుకున్నామని, మాన్‌సింగ్, మతీన్‌మీర్జా, గిరి, వీరన్నగౌడ్, బాలాజికధన్‌ను రిమాండ్‌కు తరలిస్తున్నామని తెలిపారు. మరో ఇద్దరు శివానంద్, జీవన్ పరారీలో ఉన్నారని వారిని కూడ తొందరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. దొంగలను పట్టుకున్న ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ రవీందర్, డ్రైవర్ మల్లేష్‌కు రివార్డులను అందజేశారు. పరిగి సిఐ ప్రసాద్, ఎస్‌ఐ నాగేష్, ఎఎస్‌ఐ, ట్రైని ఎస్‌ఐ ఓబుల్ రెడ్డి పాల్గొన్నారు.