తెలంగాణ

మూసీలో మునిగిన ‘్భగీరథ’ యంత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడుచర్ల, ఆగస్టు 29: నల్లగొండ జిల్లా నేరేడుచర్ల మండలంలో సోమవారం తెల్లవారుజాము నుండి భారీ వర్షం కురిసింది. రెవెన్యూ అధికారుల రికార్డు ప్రకారం 7.6 సెం.మీ వర్షాపాతం నమోదైంది. మండలంలోని చిల్లెపల్లి గ్రామ సమీపంలో మూసీనదికి వరద పెరిగింది. ఊహించని విధంగా ఒకేసారి మూసీనదిలో వరద పెరగడంతో మిషన్ భగరీథల కోసం వినియోగిస్తున్న జెసిబి, పైపులు, కంకర మిల్లర్ నీటిలో మునిగిపోయాయి. వరద వలన ప్రాథమిక అంచనా ప్రకారం మిషన్ భగీరథ పనులకు రూ.25 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు డిఇ వెంకట్‌రెడ్డి తెలిపారు. మండలంలోని బక్కయ్యగూడెం-మేడారం గ్రామం మధ్యలో ఉన్న వాగు పొంగి రహదారిపై ప్రవహించడంతో రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాకుండా ఈ వాగు పొంగి ప్రవహించడంతో పరిసర ప్రాంత రైతులు వరినారు కోసం సిద్ధంగా ఉంచుకున్న విత్తనాలు నీటిలో కొట్టుకుని పోయినట్లు వాపోయారు. పలు గ్రామాల్లో చిన్న నీటి వనరుల్లో నీరు చేరింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు కురిసిన వర్షాల్లో ఇది భారీ వర్షం. పత్తి, మిర్చి పంటలకు ఈ వర్షం మంచి దిగుబడి ఇవ్వడానికి దోహదపడింది. వరిసాగు చేసే రైతులకు నారుమల్లు పెంచుకోవడానికి, నాటు పెట్టడానికి, పొలం చదును చేయడానికి, దమ్ము చేసిన పొలాలకు నాటు పెట్టడానికి ఈ భారీ వర్షం రైతులకు ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు ఖరీఫ్ సాగుపై రైతులు ఊగిసలాడుతుండగా ప్రభుత్వం సాగర్ కాల్వకు నీరు విడుదల చేయడం, 2, 3రోజులుగా భారీవర్షాలు కురవడం ఆయకట్టు ప్రజల్లో ఉత్సాహం నింపింది. భారీ వర్షాల వల్ల చిన్నచిన్న నష్టాలు వాటిల్లినప్పటికీ గత సంవత్సరం ఖరీఫ్, రబీ పంటలకు నీరు లేక సాగుచేయక ఆందోళన చెందుతున్న రైతులకు ఈ వర్షంతో ఆనందంతో ఉన్నారు.