తెలంగాణ

కత్తులు, పిస్తోళ్లు చూపి.. బలవంతంగా సంతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, ఆగస్టు 29: గ్యాంగ్‌స్టర్ నరుూమొద్దీన్, అతని అనుచరుల ఆగడాలపై సిట్ పోలీసులకు అందుతున్న ఫిర్యాదుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. కత్తులు, పిస్తోళ్లు చూపించి భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా కుటుంబసభ్యులను చంపేస్తామని బెదిరించి 59.34 ఎకరాల భూమిని అక్రమంగా నరుూం అనుచరులు కబ్జా చేసుకున్న సంఘటనపై బాధితులు నల్లగొండ జిల్లా భువనగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే...్భవనగిరి శివారులోని జాతీయ రహదారి పక్కన రామకృష్ణాపురం క్రాస్ రోడ్డు వద్ద భువనగిరి మండలానికే సందించిన తుక్కాపురం గ్రామస్థులు వల్లపు భగవంతు, మల్లేశ్, అంజయ్య, రాజమల్లు, శ్రీశైలం, కృష్ణస్వామి, నాగార్జున్‌లకు చెందిన 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80-ఈ సర్వే నెంబర్లలో గల 59.34 ఎకరాల భూమిని నరుూం అనుచరులైన పాశం శ్రీనివాస్, మరణించిన మాజీ మున్సిపల్ చైర్మన్ శివనాగేందర్ తమ ఇంటికి పిలిపించుకుని దుర్భాషలాడి మారణాయుధాలతో బెదిరించి సంతకం చేయించుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు వారసత్వంగా వచ్చిన భూమిని తమకు ఇప్పించాలని ఫిర్యాదులో కోరారు. అదేవిధంగా భువనగిరి మండలం అనంతారం గ్రామ పరిధిలో గల పట్టణం శివారులోగల రేణుకా ఎల్లమ్మగుడి సమీపంలోని రైల్వేట్రాక్ పక్కన 131, 132 సర్వేనెంబర్లలోగల తాను కొనుగోలు చేసిన 2.29 ఎకరాలల్లో 7 గుంటలు భూమిని నరుూం అనుచరున్నని నిరంజన్‌రెడ్డి 7 గుంటల భూమిని కబ్జా చేసినట్లు పి.దయాకర్‌రెడ్డి అనే వ్యక్తి సిట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు బీబీనగర్ మండ లం గొల్లగూడెం నీలంబావుల గ్రామానికి చెందిన పి.దయాకర్‌రెడ్డి 1991లో 2.29 ఎకరాలు కొనుగోలు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 7 గుంటల భూమి జాతీయ రహదారి విస్తరణలో పోగా తనకు ఉండాల్సిన మిగులు 2.22 ఎకరాలు ఉండాలని కానీ సర్వేయర్‌తో సరిహద్దులు నిర్ణయించి కొలతలు వేయగా 7 గుంటల భూమి తక్కువగా తేలిందన్నారు. ఈ భూమిని అక్రమంగా తన భూమిలో కలుపుకొని తన భార్య చంద్రకళ పేరున అక్రమంగా రికార్డులలో నమోదు చేసుకుని నిరంజన్‌రెడ్డి తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అందరి డాక్యుమెంట్లు సరిచూసి తన భూమిని ఇప్పించవలసినదిగా కోరినట్లు తెలిపారు.

చిత్రం.. భువనగిరి పోలీస్‌స్టేషన్ ఎదుట ఫిర్యాదులు ప్రదర్శిస్తున్న బాధితులు