తెలంగాణ

తొలిరోజు నుంచే పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 30: దసరా నుంచి కొత్త జిల్లాలు ఉనికిలోకి రానున్నందున అధికారిక కార్యకలాపాలు ఆరోజు నుంచే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్టోబర్ 11నాటికి రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే నూతన జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్‌పిలతో పాటు అన్ని శాఖల కార్యాలయాలు తమ కార్యకలాపాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త జిల్లాలకు నియామకమయ్యే కలెక్టర్లు అన్ని శాఖలకు సంబంధించిన ఫైళ్లను వర్గీకరించి, క్రమ పద్ధతిలో అనుసూచికలు ఏర్పాటు చేసి నూతన జిల్లాలకు అందజేయాలని చెప్పారు. జిల్లాల్లో వివిధ శాఖల్లో పని చేస్తున్న సిబ్బంది వివరాలు, వారి సీనియారిటీ, పోస్టుల సంఖ్య వివరాలతో నిర్ణీత ప్రొఫార్మాలో సిద్ధం చేసి నివేదిక అందించాలని కోరారు. అదేవిధంగా వివిధ శాఖలు పని చేయడానికి అవసరమై భవనాలు గుర్తించి, వాటికి ఫర్నీచర్‌ను సమకూర్చాలన్నారు. జిల్లాలు ఏర్పడిన మొదటి రోజు నుంచే ట్రెజరీ అకౌంట్‌ను ప్రారంభించి, ట్రెజరీ కార్యాలయాలు కూడా పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త జిల్లాలకు సిబ్బందిని సర్దుబాటు చేసే సందర్భంగా సిబ్బందికి పాత సీనియారిటీనే కొనసాగుతుందని, తరువాత దాని ఆధారంగానే పదోన్నతులు కల్పించనున్నట్టు రాజీవ్ శర్మ తెలిపారు. కొత్త జిల్లాల్లో ఫైళ్ల నమోదు కోసం సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్టు చెప్పారు.
తెలంగాణలో చేపట్టే రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సిఎస్ ఆదేశించారు. రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులపై ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నారన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై సిఎం కెసిఆర్ ఇప్పటికే రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుతో చర్చించారని చెప్పారు. వీటికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, అవసరమైన చోట రైల్వే, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సర్వేలు చేపట్టాలన్నారు. అదే విధంగా ప్రాజెక్టుల వారీగా కలెక్టర్లు రైల్వే అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ నిరంతరం సమీక్షించాలని సూచించారు.
chitram...
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సిఎస్ రాజీవ్ శర్మ