తెలంగాణ

భూ తగాదా విషయంలో పోలీసులపై గిరిజనుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివ్వంపేట, ఆగస్టు 30: భూ తగాదం విషయం సోమవారం అర్దరాత్రి 2 గంటల ప్రాంతంలో స్థానిక పోలీసులపై గిరిజనులు రాళ్లు, కారంపొడి, కట్టెలతో దాడి చేసిన సంఘటన మండల కేంద్రమైన శివ్వంపేట గ్రామపంచాయితీలో గల తాలపల్లి ధర్మతాండలో జరిగింది. తూప్రాన్ డిఎస్పీ వెంకటేశ్వర్లు మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ హైదరాబాద్‌కు చెందిన వినతి, ప్రవీన్‌కుమార్‌రావులకు చెందిన 316 సర్వేలో సుమారు 65 ఎకరాల భూమి పట్టా ఉందని, వారు ఆ భూమి చుట్టు ప్రహారి గోడ కట్టారు. అదే తండాకు చెందిన గిరిజనులు దానిని ధ్వంసం చేస్తుండగా భూ యజమాని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం రాత్రి 2 గంటల ప్రాంతంలో తూప్రాన్ సిఐ రమేశ్‌బాబు, వెల్దుర్తి ఎఎస్సై శివకుమార్, శివ్వంపేట హెడ్‌కానిస్టేబుల్ పాండరి, మరో ముగ్గురు భూ కాపాలాదారులు రమేశ్, శ్రీను, రమణయ్యలపై గిరిజనులు దాడికి పాల్పడటంతో వారు తీవ్ర గాయాలపాలయ్యారు. పరిస్థితి విషమించడంతో గాయపడిన పోలీసులను హైదరాబాద్ ఆస్పత్రికి తరలించినట్లు డిఎస్పీ తెలిపారు.