తెలంగాణ

ఆ ఐదుగురే కీలకం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 30: గ్యాంగ్‌స్టర్ నరుూమొద్దీన్ అలియాస్ నరుూం అక్రమ వ్యవహారాలపై సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నరుూం ఎన్‌కౌంటర్ తరువాత నరుూం అనుచరుల కోసం సిట్ అధికారులు వేటాడుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు అరెస్టయిన 50 మందిలో నరుూం అనుచరులు, బంధువులు మాత్రమే ఉన్నారు. కానీ ముఖ్య అనుచరుడు శేషన్నతోపాటు మరో నలుగురే ఈ కేసులో కీలకమని సిట్ అధికారులు తేల్చేశారు. వీరు దొరికితే నరుూం కేసు ఓ కొలిక్కి వచ్చినట్టేనని సిట్ అధికారి ఒకరు తెలిపారు. అయితే నరుూం అక్రమ వ్యవహారాలతో పోలీసులు, రాజకీయ నాయకులకు కూడా లింక్ ఉందని వస్తున్న అభియోగాలపై వారి విచారణపై గానీ, అరెస్టులపై గానీ సిట్ అధికారులు నోరుమెదపడం లేదు. నరుూం ఎన్‌కౌంటర్ తరువాత కొందరు రాజకీయ నాయకులు, పోలీస్ ఉన్నతాధికారులకు నరుూంతో లింకులున్నాయని, నరుూం అక్రమ వ్యవహారాల్లో ఉన్నారంటూ వచ్చిన వార్తలను ఓ మాజీ మంత్రి, ఓ ఎమ్మెల్సీ, ఓ మాజీ పోలీస్ అధికారి ఖండించిన విషయం విదితమే. అంతేకాకుండా గ్యాంగ్‌స్టర్ నరుూంతో తమకెలాంటి సంబంధం లేదని కూడా విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.
కాగా నరుూం ఎన్‌కౌంటర్ జరిగిన పక్షం రోజుల తరువాత సిట్ అధికారుల సోదాల్లో నరుూం డైరీ లభించింది. ఈ డైరీలో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టుల పేర్లు కూడా ఉన్నట్టు వినికిడి. అయితే నరుూం డైరీలోని పేర్లను సిట్ అధికారులు బయటపెట్టాలని పలువురు ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు నరుూం ముఖ్య అనుచరులు శేషన్నతోపాటు మరో నలుగురు దొరికేవరకూ నరుూం డైరీలోని పేర్లను బయటకు పెట్టే అవకాశం లేదని తెలుస్తోంది. నరుూంకు నల్లగొండ జిల్లాలో ముఖ్య అనుచరుడైన పాశం శ్రీనును ఇటీవల అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా మంగళవారం పాశం శ్రీనును భువనగిరి కోర్టు మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చింది.