తెలంగాణ

పోలీస్ కస్టడీకి పాశం శ్రీనివాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, ఆగస్టు 30: పోలీసుల అభ్యర్థన మేరకు గ్యాంగ్‌స్టర్ నరుూం ముఖ్యఅనుచరుడు నల్ల గొండ జిల్లా భువనగిరికి చెందిన పాశం శ్రీనివాస్‌ను 31వ తేదీ 10 గంటల నుండి మూడురోజులపాటు పోలీస్ కస్టడీకి భువనగిరి అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూ ర్తి ఎన్.రాధిక అనుమతించారు. పాశం శ్రీనివాస్‌పై పిడియాక్టు నమోదు కావడంతో నల్లగొండ ఎస్పీ ప్రకాష్‌రెడ్డి ఎదుట లొంగిపో గా శ్రీనివాస్‌ను పోలీసులు వరంగల్ జైలుకు తరలించారు. పాశం శ్రీనివాస్ భూఆక్రమణలు, బెదిరింపులకు పాల్పడ్డట్లుగా పదుల సం ఖ్యలో పోలీసులకు ఫిర్యాదులందడంతో వాటిపై విచారించేందుకు పోలీసులు పాశం శ్రీనివాస్‌ను కస్టడీకి కోరుతూ వేసిన పిటిషన్ విచారించిన అనంతరం మూడు రోజు ల పోలీసు కస్టడీకి అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి ఎ.రాధిక అనుమతించారు.

నరుూం అనుచరుడు
సంజీవరెడ్డి అరెస్టు

పటన్‌చెరు, ఆగస్టు 30: ఇటీవల పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన నరుూం అనుచరుడు సామ సంజీవరెడ్డిని మంగళవారం రాత్రి సిట్ అధికారులు అరెస్టు చేసారు. పటన్‌చెరు మండలం ముత్తంగి గ్రామ శివారులలో గల విష్ణు లాడ్జీపై దాడి చేసిన సిట్ అధికారులు సంజీవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో లాడ్జీపై ఆకస్మిక దాడి జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు నరుూం అనుచరుడిని పట్టుకున్నారు. ఈ విషయమై స్థానిక పోలీసులను వివరాల కోసం ప్రశ్నించగా తమకు ఎలాంటి సమాచారం లేదని సమాధానం ఇచ్చారు. నరుూం కేసును పరిశోధిస్తున్న ప్రత్యేక బృందం అధికారులు ముత్తంగి విష్ణు లాడ్జీపై దాడి చేసినట్లు తమకు ఎలాంటి సమచారం లేదని తెలియ చేస్తున్నారు.