రాష్ట్రీయం

ప్రైవేటు స్వర పరీక్ష చెల్లుతుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 31: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకునోటు కేసు వ్యవహారం ఎసిబి కోర్టు ఆదేశాలతో కొత్త మలుపు తిరిగింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో తెలుగుదేశం పార్టీ నేతలు చిక్కుల్లో పడతారని కొందరు, అసలు ఇది వాదనకు నిలిచే కేసు కాదని మరికొందరు వాదిస్తున్నారు. ఏపి సిఎం చంద్రబాబునాయుడుకు చిక్కులు తప్పవని ఒక వర్గం మీడియా ప్రచారం చేస్తుండగా, మరికొందరు గత కేసులను ఉదహరిస్తూ ఇది నిలిచే కేసు కాదంటున్నారు. అయితే, ఈ కేసు నిలిచినా, నిలవకపోయినా నిందితులుగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు, పార్టీపై రాజకీయ విమర్శలు చేసేందుకు, మానసికంగా దెబ్బ తీసేందుకు ప్రత్యర్థి పార్టీలకు బ్రహ్మాస్త్రంగా పనికివస్తుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ప్రధానంగా.. పిటిషనర్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక అంతర్జాతీయ కంపెనీకి బాబు వాయిస్ టేపులను పరీక్షకు పంపగా, అది బాబు గొంతేనని తేలిందన్న వాదన చట్టాల ముందు నిలిచే అవకాశాలు లేదన్న చర్చ జరుగుతోంది. ఆడియో టేపులను సాక్ష్యాలుగా పరిగణించకూడదన్న గత తీర్పులను గుర్తు చేస్తున్నారు. అది కోర్టు ఆదేశాలతో చేయించిన పరీక్ష కానందున, ఏ విధంగా సాక్ష్యంగా పనికివస్తుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా చీకట్లో విసిరిన రాళ్లలాగా ఉండకూడదంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తున్నారు.
కాగా టేపులో చంద్రబాబు వాయిస్ ఉన్నందున ఆయనకు చిక్కులు తప్పవని, ఆయనకూ నోటీసులిచ్చి, కోర్టు పిలిపిస్తుందన్న మరో ప్రచారం వినిపిస్తోంది. అయితే, అందులో బాబు మీకు ఓటేసినందుకు డబ్బులు ఇస్తామని చెప్పలేదని, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోమని మాత్రమే చెప్పారని తెదేపా వర్గాలు వాదిస్తున్నాయి. కేసు చెల్లదని ఉన్నత న్యాయస్థానమయిన హైకోర్టు స్పష్టం చేసిన తర్వాత, మళ్లీ అదే కేసులో ఎసిబి కోర్టు తీర్పు ఇవ్వడం చెల్లదని న్యాయవాదులు స్పష్టం చేస్తున్నారు. ఈ విచారణకు ఎసిబి పరిధి లేదని హైకోర్టు న్యాయమూర్తి శంకర్‌రావు ఇచ్చిన తీర్పును తమ వాదనకు మద్దతుగా ఉదహరిస్తున్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లిన సందర్భంలో, దానిపై స్టే ఇచ్చి ఉంటే కథ మరోలా ఉండేది. ఓటు వేయడం ప్రజాప్రతినిధుల అధికార విధి కానప్పుడు అక్కడ అవినీతి నిరోధక చట్టం వర్తించదని వారంటున్నారు.ప్రైవేటు కంపెనీలు ఇచ్చిన స్వర నమూనా పరీక్షల నివేదికల ఆధారంగా విచారణ చేయడం కుదరదని, అదే కోర్టు స్వయంగా ఆదేశిస్తేనో, ప్రభుత్వమే స్వయంగా ఆదేశించి ఆ నివేదికను కోర్టుకు సమర్పిస్తే మాత్రమే చెల్లుబాటవుతుందని న్యాయవాదులు చెబుతున్నారు.
అయితే, రేవంత్‌రెడ్డి దగ్గర స్వాధీనం చేసుకున్న 50 లక్షల వ్యవహారమే న్యాయపరంగా ఇబ్బందిపెట్టవచ్చని చెబుతున్నారు. ఆ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి? ఏ అకౌంట్ నుంచి వచ్చాయి? స్టీఫెన్సన్‌తో రేవంత్ భేటీ.. ఇలాంటి అంశాలన్నీ పునర్విచారణ ద్వారా మళ్లీ జనం, మీడియాలో చర్చ జరిగేందుకు అవ