తెలంగాణ

మత్తువీడిన పాలమూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, డిసెంబర్ 1: మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు కొన్ని దశాబ్దాల నుండి ఎదుర్కోంటున్న గుడుంబా రక్కసి పీడ ఎట్టకేలకు విరగడైంది. ఎక్సైజ్ శాఖతో పాటు వివిధ శాఖల అధికారులు సారా తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపడంతో సారారహిత జిల్లాగా మహబూబ్‌నగర్ చరిత్రలోకి ఎక్కింది. గత మూడు నెలల నుండి అధికార యంత్రాంగం తీసుకున్న చర్యల ఫలితంగా సారా రహిత జిల్లాగా మహబూబ్‌నగర్ రూపొందిందని మంగళవారం జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి ప్రకటించారు. మహబూబ్‌నగర్‌లో ఎక్సైజ్ శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ టికె శ్రీదేవి సారా రహిత జిల్లా మహబూబ్‌నగర్ అంటూ ప్రకటన చేశారు. అదేవిధంగా కల్తీకల్లు రహిత జిల్లాగా కూడా రూపొందించడానికి అడుగులు వేస్తామని ఎక్సైజ్ అధికారులతో ప్రమాణం చేయించి సారా నిషేదానికి పని చేసిన ఎక్సైజ్ అధికారులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి, ఎస్పీ విశ్వప్రసాద్‌లు అందజేశారు. ఇది ఇలా ఉండగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నో దశాబ్దాల నుండి సారాకు నిలయంగా మారిన వందలాది గ్రామాలపై ఎక్సైజ్ అధికారులు ముకుమ్మడి దాడులు చేయడం ఊహించని ఫలితాలను చ్చిందని చెప్పవచ్చు. అందులో భాగంగా 1515 రెవెన్యూ గ్రామాలకు గాను 1512 గ్రామాలను గుడుంబారహిత గ్రామాలుగా గుర్తించారు. ప్రస్తుతం ఈ గ్రామాల్లో సారా అమ్మకాలుగానీ, తయారీగానీ పూర్తిగా నిషేదించారు. ఇందుకు ప్రధాన కారణం జిల్లాలో సారా తయారీ విక్రయాలకు ప్రధాన సూత్రదారులైన 1441 మందిని ఆరెస్టు చేయడం అంతేకాకుండా విక్రయాలకు పాల్పడుతున్న 3858 మందిపై బైండోవర్ కేసులు విధించారు. అందులో 10 పీడీ యాక్ట్ కేసులు ప్రయోగించి గుడుంబా తయారీ విక్రయదారులను కటకటల పాలు చేశారు. పిడియాక్ట్ ఉపయోగించడంతో బెంబేలెత్తిన ప్రజలు గుడుంబా రక్కసికి ఏకకాలంలో దూరమయ్యారు. దాడుల సమయంలో రూ.17.70లక్షలను కూడా ఎక్సైజ్‌శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని తమ శాఖలో జమచేసి ఇందుకు బాధ్యులైన వారిపై కూడా కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ టికె శ్రీదేవి మాట్లాడుతూ సారారహిత జిల్లాగా మహబూబ్‌నగర్ రూపాంతరం చెందిందని ఇందుకు యంత్రాంగం తీసుకున్న చర్యల ఫలితం ప్రజల జీవితాలను సన్మార్గంలో నడిపించడానికి ఉపయోగపడ్డయన్నారు. ఇదే స్పూర్తితో కల్తీకల్లు రహిత జిల్లాగా కూడా ప్రకటించేందుకు అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఎస్పీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ, మరికొన్ని శాఖలు టీం వర్క్ చేయడంతో అనుకున్న ఫలితాలను సాధించి సారా మహమ్మారి నుండి జిల్లా ప్రజలను విముక్తి చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ కమీషనర్ గోపాలకృష్ణ, అసిస్టెంట్ కమీషనర్ అశోక్‌కుమార్, జైలు సూపరింటెండెంట్ సంపత్‌కుమార్, ఎక్సైజ్ సూరింటెండెంట్లు నర్సింహరెడ్డి, జనార్థన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

చిత్రం...సారా రహిత జిల్లాగా మహబూబ్‌నగర్‌ను ప్రకటిస్తున్న కలెక్టర్ శ్రీదేవి