తెలంగాణ

నరుూం గ్యాంగ్‌లో 12మంది రియల్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 31: గ్యాంగ్‌స్టర్ నరుూం బినామీలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నరుూం అక్రమ ఆస్తులు, వ్యవహారాల బినామీ బాధ్యుడు రియల్టర్ సామ సంజీవరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తాజాగా బుధవారం గ్యాంగ్‌స్టర్ నరుూం మరో ప్రధాన అనుచరుడు నల్లగొండ జిల్లా వలిగొండ ఎంపిపి శ్రీరాముల నాగరాజు, అతని కొడుకు నితిన్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నరుూం గ్యాంగ్‌లో 12 మంది రియల్టర్లు ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా పేరు మోసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు. రైతులను బెదిరించి భూములను అతి తక్కువ ధరకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలుస్తోంది. కోబ్రా ముసుగులో ఈ ముఠా సభ్యులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తోందని సిట్ అధికారి ఒకరు తెలిపారు. వీరంతా తపంచా, పిస్టల్స్ ఉపయోగించి బెదిరింపులకు దిగుతారని, ఉప్పల్, హయత్‌నగర్, ఎల్‌బినగర్, ఆదిభట్ల, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, యాచారం ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా జీవితం ప్రారంభించిన ఈ 12మంది గ్యాంగ్‌స్టర్ నరుూం నీడలో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టుకున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో భారీ ధర పలుకుతుందని స్థల యజమానులను భయభ్రాంతులకు గురిచేసి లాక్కునే వారని తెలుస్తోంది. ఇలా హయత్‌నగర్, అబ్దుల్లాపూర్ మెట్ వద్ద విలువైన 40 ప్లాట్లను వీరు సొంతం చేసుకున్నట్టు సిట్ అధికారులకు ఫిర్యాదులు అందినట్టు సమాచారం. ఐటి కారిడార్‌కు సమీపంలోని ఆదిభట్ల వద్ద కూడా ముగ్గురి నుంచి సుమారు 12 ఎకరాలను నరుూం అనుచరులమంటూ తక్కువ రేటుకు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. మేడ్చల్ వద్ద 15 ఎకరాల పొలం పంపకంలో అన్నదమ్ముల మధ్య నెలకొన్న వివాదాన్ని ఇదే బృందం అవకాశంగా తీసుకున్నట్టు ఫిర్యాదు వచ్చినట్టు తెలిసింది. కాగా ఈ ముఠా సభ్యులతో నగరానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి సామ సంజీవరెడ్డికి సంబంధాలున్నట్టు సిట్ నిర్ధారించింది.
ఇదిలా ఉండగా, నరుూం కేసు దర్యాప్తులో భాగంగా అతని అనుచరుల కస్టడీ బుధవారం ముగియడంతో నిందితులు గోపి, రమేష్‌లను కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. నరుూం గ్యాంగ్‌లోని ప్రధాన అనుచరుడు పాశం శ్రీనును మూడు రోజుల పాటు కోర్టు అనుమతితో సిట్ అధికారులు తమ కస్టడీకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అదేవిధంగా నరుూం ముఖ్య అనుచరుల్లో ఒకరైన శ్రీహరి రంగారెడ్డి జిల్లా కోర్టులో లొంగిపోయాడు. గతంలో సోహ్రాబుద్దీన్ కేసులో శ్రీహరి పాత్రపై సిట్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చర్లపల్లి కేంద్ర కారాగారం అధికారి రాజమహేశ్‌ను చంపుతామంటూ వచ్చిన బెదిరింపు కాల్ కలకలం రేపుతోంది. ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి ఈ కాల్ వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. అల్వాల్‌కు చెందిన సొందుబాబు, మల్లారెడ్డి బెదిరిస్తున్నారని జైలు అధికారి రాజమహేశ్ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇదిలావుండగా జైలు అధికారిని బెదిరించింది నరుూం అనుచరులా? లేక జైల్లో ఖైదీలుగా ఉన్న ఉగ్రవాదుల సానుభూతిపరులా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దిశగా ప్రత్యేక పోలీస్ బృందం విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది.