తెలంగాణ

తెలంగాణలో తగ్గిన సైబర్ నేరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 31: మహిళలపై అత్యాచారాల గణాంక వివరాలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసింది. సైబర్ నేరాలు ఆంధ్రాలో పెరిగితే, తెలంగాణలో తగ్గాయి. దేశం మొత్తం మీద సైబర్ నేరాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరవ స్ధానంలో నిలిచింది. ఆర్ధిక నేరాల్లో తెలంగాణలో 8979 కేసులు, ఆంధ్రాలో 6669 కేసులు నమోదయ్యాయి. 2015లో ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాల కేసులు 1027, తెలంగాణలో 1105 నమోదయ్యాయి. ఏపిలో అత్యాచార యత్నం కేసులు 206, మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన కేసులు 4616, అవమానించిన కేసులు 2200 కలిపి లైంగికపరమైన నేరాల కేసులు 8049 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో అత్యాచార ప్రయత్నాల కేసులు 43, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులు 3608 కేసులు, అవమానించిన కేసులు 1288 కలిపి మొత్తం 6044 కేసులు నమోదయ్యాయి. ఏపిలో హత్యలు 1099, హత్యా యత్నాల కేసులు 1737, కిడ్నాపింగ్ కేసులు 917, దోపిడీ కేసులు 384, కొట్లాటలు 554, హింసాత్మక సంఘటనలు 436, వరకట్నం మరణాలు 174, దోపిడీలు 55 కలిపి మొత్తం హింసాత్మక కేసులు 6955 కేసులు నమోదయ్యాయి. హింసాత్మక కేసులకు సంబంధించి తెలంగాణలో హత్యలు 1188, హత్యాయత్నం కేసులు 1143, కిడ్నాపింగ్ కేసులు 1044, దోపిడీలు 36, దొంగతనాలు 377, కొట్లాటలు 554, హింసాత్మక సంఘటనలు 436, వరకట్నం చావులు 262 కలిపి మొత్తం 6306 కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరాలను విశే్లషిస్తే 2014తో పోల్చితే 2015లో తెలంగాణలో ఈ నేరాలు తగ్గాయి.
2014లో 703 కేసులు, 2015లో 687 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లవో సైబర్ నేరాలు పెరిగాయి. 2014లో 282 నేరాలు, 2015లో 536 కేసులు నమోదయ్యాయి. ఆర్ధిక నేరాలనువిశే్లషిస్తే ఆంధ్రాలో నమ్మక ద్రోహం కేసులు 815, మోసం కేసులు 5532, ఫోర్జరీ కేసులు 235, నకిలీ కరెన్సీ నోట్ల కేసులు 87 కలిపి మొత్తం 6669 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో నమ్మకద్రోహం కేసులు 632, మోసం కేసులు 8000 కేసులు, ఫోర్జరీ కేసులు 300, నకిలీ కరెన్సీ నోట్ల కేసులు 47 కలిపి మొత్తం 8979 కేసులు నమోదయ్యాయి.మహిళలపై జరిగిన మొత్తం నేరాలను విశే్లషిస్తే 2015లో తెలంగాణలో 15135 కేసులు, ఆంధ్రాలో 15931 కేసులు నమోదయ్యాయి. లైంగికవేధింపుల కేసులను విశే్లషిస్తే ఆంధ్రాలో 1981 కేసులు, తెలంగాణలో 623 కేసులు నమోదయ్యాయి.
ఆఫీసు ఆవరణల్లో మహిళల పట్ల అవమానంగా ప్రవర్తించిన కేసుల్లో ఆంధ్రాలో మూడు కేసులు, తెలంగణలో 32 కేసులు, ఇతర పని ప్రదేశాలకు సంబంధించి ఏపిలో 103 కేసులు, తెలంగాణలో 170 కేసులు నమోదయ్యాయి. భార్యల పట్ల భర్తలు క్రూరంగా ప్రవర్తించినందుకు కేసుల నమోదుకు సంబంధించి ఉద్దేశించిన 498-ఏ సెక్షన్ కింద ఆంధ్రాలో 6129 కేసులు, తెలంగాణలో 7329 కేసులు నమోదయ్యాయి.