తెలంగాణ

గృహ నిర్మాణ శాఖ ప్లాట్లు, విల్లాల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 31: గృహ నిర్మాణశాఖ-జాయింట్ వెంచర్ ప్రాజెక్టులలో కొనుగోలు చేసిన ప్లాట్లు, విల్లాలకు వివిధ కారణాల వల్ల ఆగిపోయిన రిజిస్ట్రేషన్లను చేయడానికి మంత్రివర్గ ఉప సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాయింట్ వెంచర్లను పొందిన కంపెనీలు గృహ నిర్మాణ శాఖకు చెల్లించాల్సిన రెవిన్యూ వాటాను చెల్లించే పక్షంలో మాత్రమే రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తున్నట్టు ఉపసంఘం షరతు విధించింది. సచివాలయంలో గృహ నిర్మాణశాఖ-ప్రైవేట్ కంపెనీలు సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాజెక్టుల సమస్యల పరిష్కారంకోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం బుధవారం సమావేశమైంది. ఉప సంఘం చైర్మన్ గృహ నిర్మాణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సభ్యులు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డితో పాటు అధికారులు, జాయింట్ వెంచర్ కంపెనీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. గచ్చిబౌలి, వరంగల్‌లో రాంకీ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులో బలహీన వర్గాలకోసం ఉద్దేశించిన గృహ నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయలేదని అధికారులు ఉప సంఘం దృష్టికి తీసుకువచ్చారు. అలాగే పూర్తిచేసిన వాటికి గృహ నిర్మాణ శాఖకు రెవిన్యూ వాటా చెల్లించక పోవడంతో రిజిస్ట్రేషన్లను నిలిపివేసినట్టు వారు వివరించారు. ఖమ్మంలో సుప్రభాత్ ఇన్‌ఫ్రా చేపట్టిన ప్రాజెక్టుకు సంబంధించిన రెవిన్యూ వాటాను చెల్లించలేదని వివరించారు. ఈ రెండు కంపెనీల ప్రతినిధులు రెవిన్యూ వాటా చెల్లించడానికి అంగీకరించడంతో రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తున్నట్టు మంత్రివర్గ ఉప సంఘం ప్రకటించింది. రాంకీ చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా రెవిన్యూ వాటా కింద గృహ నిర్మాణశాఖకు రూ.37 కోట్లు, రిజిస్ట్రేషన్ ఫీజులు, వాట్ కింద ప్రభుత్వానికి రూ.70కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారులు వివరించారు. సుప్రభాత్ ఇన్‌ఫ్రా ఖమ్మం చేపట్టిన ప్రాజెక్టులకు రెవిన్యూ వాటాగా గృహ నిర్మాణశాఖకు రూ. 22.65 కోట్లు, రిజిస్ట్రేషన్ ఫీజులు, వాట్ కింద ప్రభుత్వానికి రూ.27 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనావేసింది.