తెలంగాణ

ప్రాజెక్టులకు కేంద్ర సాయం రూ. 7 వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 31: రాష్ట్రంలో 11 సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ల రూపంలో రూ. 7 వేల కోట్ల సాయం చేయాలని కేంద్రాన్ని కోరనున్నట్టు నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు తెలిపారు. సెప్టెంబర్ రెండవ వారంలో ఢిల్లీకి అధికారులతో కలిసి వెళ్లాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన పథకం కింద 11 ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అవసరమైన నిధుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం చేసుకోనున్నట్టు మంత్రి తెలిపారు. ఇదే పథకం కింద రూ. 2500 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరనున్నట్టు ఆయన తెలిపారు. ప్రధాన మంత్రి కృషి సంచాయ్ పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులపై జలసౌధలో మంత్రి హరీశ్‌రావు బుధవారం అధికారులతో చర్చించారు. దేశవ్యాప్తంగా ఈ పథకం కింద 99 ప్రాజెక్టులకు కేంద్రం సాయం అందించనుండగా అందులో 11 ప్రాజెక్టులు రాష్ట్రానికి సంబంధించినవని మంత్రి అన్నారు. ఈ 11 ప్రాజెక్టులలో కొమురం భీమ్, గొల్లవాగు, రల్లివాగు, మత్తడివాగు, పెద్దవాగులకు 2006లోనే అనుమతి లభించిందన్నారు. పాలెం వాగు, శ్రీరామ్‌సాగర్ రెండో దశకు 2005-06, దేవాదుల, జగన్నాథపూర్ ప్రాజెక్టులకు 2006-07లో అనుమతి లభించిందన్నారు. వీటిని పూర్తి చేయడానికి కేంద్రం నుంచి 60 శాతం గ్రాంట్ల రూపంలో విడుదల చేయాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు. వీటిని వెంటనే విడుదల చేయాలని కోరడానికి ఢిల్లీ వెళ్లనున్నట్టు మంత్రి వివరించారు.
పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితులకు రూ. 60 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. తెలంగాణ పరిధిలోని ముంపు గ్రామాలకు పరిహారం ఇచ్చినా ఖాళీ చేయించడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుకాయించిందని, దీనిపై తాము గట్టిగా నిలదీయడంతో ఎట్టకేలకు నిర్వాసితులకు పరిహారం చెల్లించడానికి ముందుకు వచ్చిందని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.