తెలంగాణ

భారీగా పెరిగిన భూవినియోగ మార్పిడి చార్జీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 1: తెలంగాణలో భూవినియోగ మార్పిడి చార్జీలు భారీగా పెరిగాయి. మున్సిపల్ కార్పోరేన్లు, మున్సిపాలిటీలు, నగరపంచాయితీలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌లో నివాస, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ, కన్జర్వేషన్,గ్రీన్ బెల్ట్, రిక్రియేషన్ జోన్లలోని భూములను సంబంధిత పనికి కాకుండా ఇతర పనులకోసం వినియోగించుకోవాలని భావించే వారినుండి అభివృద్ధి చార్జీలు (డెవలప్‌మెంట్ చార్జెస్) ప్రస్తుతంఉన్న చార్జీలపై 25 శాతం నుండి 100 శాతం వరకు అదనంగా పెంచారు. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజి గోపాల్ పేరుతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో వౌలికవసతుల ప్రాజెక్టులకు నిధులను సమకూర్చేందుకు ఈ చార్జీలను పెంచారని తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటైన పట్టణాభివృద్ది సంస్థలకు ఈ పెంపుదల వర్తిస్తుంది. యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థలో పెరిగిన చార్జీలు రాష్టర్రాజధానిలో వసూలు చేసే చార్జీలకు సమానంగా ఉన్నాయి. యాదాద్రిలో చదరపుమీటర్ స్థలానికి 120 రూపాయల నుండి 200 రూపాయల వరకు భూమార్పిడి చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించారు. వాణిజ్య, గృహాలకు క్యాటగిరీలకు మార్చేందుకు చదరపుమీటర్‌కు 200 రూపాయలు అభివృద్ధిచార్జీని వసూలు చేస్తారు. పరిశ్రమల క్యాటిగిరీకి భూములను మార్చేందుకు చదరపుమీటర్‌కు 120 రూపాయలు నిర్ణయించారు.