తెలంగాణ

నైపుణ్యానికి పదును

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 2: దేశవ్యాప్తంగా 25వేల నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ వెల్లడించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దోమల్‌గూడలోని ఎవి కాలేజీలో తెలంగాణ జాగృతి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని కేంద్ర మంత్రి శుక్రవారం ప్రారంభించారు. కేంద్ర మంత్రులు రాజీవ్ ప్రతాప్ రూఢీ, బండారు దత్తాత్రేయ, గవర్నర్ నరసింహాన్, ఎంపీలు కవిత, జితేందర్‌రెడ్డి తదితరులు కార్యక్రంమలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ నైపుణ్యం పెంపుదల కోసం ప్రధాని మోదీ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. గడిచిన రెండేళ్లలో నైపుణ్యాభివృద్ధి శిక్షణకు 12వేల కోట్లు వెచ్చించారని, వచ్చే రెండేళ్లలో 32వేల కోట్లు వెచ్చించనున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా 25వేల నైపుణ్య శిక్షణ కేంద్రాలు ప్రారభిస్తున్నట్టు చెప్పారు. ప్రతి పార్లమెంట్ నియోజక వర్గంలోనూ శిక్షణ కేంద్రాలు ఉంటాయని, తమ పరిధిలోని యువత నైపుణ్యవంతులుగా తయారుకావడానికి ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపించాలని కేంద్ర మంత్రి కోరారు. రాజకీయాలు వేరని, దేశాభివృద్ధి, యువతకు ఉపాధికి సిద్ధం చేయడం కోసం అంతా కలిసి పనిచేయాలని అన్నారు. డాక్టర్లు, ఇంజనీర్లే కాదు ప్రతి పనిలోనూ నైపుణ్యం ఉండాలని, నైపుణ్యం ఉన్నవారికి ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు ఉంటాయని కేంద్రమంత్రి సూచించారు. మా అమ్మాయి బ్యూటీషియన్ అని తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకోవాలి, డాక్టర్లు, ఇంజనీర్లకన్నా ఎక్కువ సంపాదించే వెల్డర్లు ఉన్నారని అన్నారు. నైపుణ్య శిక్షణలో తెలంగాణ జాగృతి కృషిని కేంద్ర మంత్రి అభినందించారు. తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఈ రంగంలో కవిత చేస్తున్న కృషి బాగుందన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి దేశ యువతకు ఉపాధిలభించే విధంగా శిక్షణ కార్యక్రమాలపై దృష్టి సారించారని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు.
తెలంగాణ వేగంపెంచాలి
విద్య వ్యాపారంగా మారిందని గవర్నర్ నరసింహాన్ ఆవేదన వ్యక్తం చేశారు. సరస్వతి దేవి లక్ష్మీదేవిగా మారిందని, తిరిగి సరస్వతి దేవిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. తాము చదువుకునే రోజుల్లో పాఠశాల స్థాయిలోనే ఏదో ఒక వృత్తి విద్య నేర్పేవారని గుర్తు చేసుకున్నారు. చదువు, వృత్తి శిక్షణ కలిసే సాగాలన్నారు. విద్యా వ్యవస్థ వ్యాపారమయంగా మారందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ అనేది చదువులో భాగంగానే ఉండేదని, తరువాత విద్యా వ్యవస్థ విఫలమైందని అన్నారు. తెలంగాణ ఆవిర్భవించి రెండేళ్లు అవుతోంది, ఇక స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగాలులేక కాదు నైపుణ్యం ఉన్న వారి కొరత ఉందన్నారు. మంచి విద్యా వ్యవస్థ కోసం ప్రభుత్వం కృషి చేయాలని, పాలనలో వేగం పెంచాలని సూచించారు. దేశానికి నైపుణ్యం ఉన్న యువత అవసరమని, దాని కోసం శిక్షణ కేంద్రాలు పని చేస్తాయని ఎంపీ కవిత వెల్లడించారు. ఈ దేశంలో ప్రధాని, సిఎం, కేంద్ర మంత్రులు నైపుణ్య వంటి చిన్నచిన్న వాటిగురించి మాట్లాడేవారు ఉండటం అదృష్టమని అన్నారు. గతంలో ప్రధానులు, సిఎంలు పెద్ద విషయాలపై మాట్లాడారని, కానీ యువతలో నైపుణ్యం పెంచే అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించడం మంచి పరిణామమని కవిత వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి కేశల్ వికాస్ యోజన పథకం కింద తెలంగాణ జాగృతి సంస్థ తెలంగాణవ్యాప్తంగా 17 నైపుణ్య శిక్షణ కేంద్రాలను ప్రారంభించింది. ఎవి కాలేజీలో జరిగిన కార్యక్రమానికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

చిత్రం.... నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రులు ప్రతాప్ రూడీ, దత్తాత్రేయ, గవర్నర్ నరసింహన్, ఎంపీలు కవిత, అసదుద్దీన్ తదితరులు