తెలంగాణ

నెలాఖరులోగా కొత్త కలెక్టర్లు, ఎస్పీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 2: కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్సీలు, జాయింట్ కలెక్టర్లు, అడిషనల్ ఎస్సీలను ఈ నెలాఖరులోగా నియమించడానికి కసరత్తు జరుగుతోంది. ఐఏఎస్ అధికారులకు పోస్టిగ్‌లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐపిఎస్‌లకు అధికారులకు పోస్టింగ్‌లపై డిజిపి ప్రతిపాదనలు రూపొందించి ఈ నెల 15 వరకు ముఖ్యమంత్రికి పంపించడానికి కసరత్తు జరుగుతోంది. ముఖ్యమంత్రి ఆమోదం లభించిన తర్వాత ఈ నెల చివరి వారంలో కొత్త కలెక్టర్లు, ఎస్పీలకు పోస్టింగ్‌లు ఇస్తారు. కొత్త జిల్లాలు దసరా నుంచి మనుగడలోకి రానుండటంతో ఆ లోగా నియామకం అయిన తర్వాత కలెక్టర్లు, ఎస్పీలు పాత జిల్లా కేంద్రాల్లోని కలెక్టర్లు, ఎస్పీలకు రిపోర్ట్ చేస్తారు. కొత్తగా నియామకం అయిన వారికి సంబంధిత జిల్లాలకు చెందిన నివేదిక అందజేస్తారు. వాటి ఆధారంగా కొత్త జిల్లాల నుంచి పాలన సాగిస్తారు. కలెక్టర్లుగా, ఎస్పీలుగా ఒక్కో జిల్లాకు ముగ్గురు పేర్లతో ముఖ్యమంత్రికి నివేదిక అందజేస్తారు. వీరిలో ఒకరికి ముఖ్యమంత్రి ఆమోదించి తిరిగి పంపించిన తర్వాత పోస్టింగ్‌లు ఇస్తారు. చాలా మటుకు ప్రస్తుతం జాయింట్ కలెక్టర్లుగా, అడిషనల్ ఎస్సీలుగా కొనసాగుతున్న వారికే కలెక్టర్లుగా, ఎస్పీలుగా పోస్టింగ్‌లు లభించనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పని చేస్తున్న ఐపిఎస్, ఐఏఎస్ అధికారుల సీనియార్టీ ఒక్కటే కాకుండా వారి పనితీరు ఆధారంగా పోస్టింగ్‌లు లభించనున్నట్టు తెలిసింది. ఇటీవల నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో బాగా పని చేసిన అధికారుల జాబితాను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలిసింది.