తెలంగాణ

కొత్తగా 17 జిల్లా కోర్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 2: కొత్త జిల్లాల కూర్పు ప్రక్రియ మరింత వేగం పుంజుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నేతృత్వంలోని టాస్క్ఫోర్స్ కమిటీ రెండోరోజు శుక్రవారం కూడా కసరత్తు కొనసాగించింది. కీలకమైన ఆర్థిక, రెవిన్యూ, వైద్య ఆరోగ్యం, మున్సిపల్, న్యాయ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, దేవాదాయ, గృహ నిర్మాణ శాఖలపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లతో టాస్క్ఫోర్స్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలు 27 జిల్లాలుగా ఏర్పాటు అవుతుండటంతో వాటికి సరిపడే విధంగా శాఖల వారీగా అందిన ప్రతిపాదనలపై టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించి తీసుకోవాల్సిన చర్యలపై మార్గనిర్దేశం చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల ప్రభుత్వం ప్రతిష్టాకర డబుల్ బెడ్‌రూమ్ పథకం మందగించకుండా ప్రతిపాదిత 27 జిల్లాల్లో దీని పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా అధికారికి సహాయకారిగా మరో ఇద్దరిని నియమించుకోవాలని ఆదేశించింది. హైదరాబాద్ వినా ప్రస్తుతం 9 జిల్లాల్లో 9 జిల్లా కోర్టులున్నాయి. వీటిని మినహాయించి కొత్తగా 17 జిల్లా కోర్టులను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించింది. మంచిర్యాల, కొత్తగూడెం, భువనగిరి (యాదాద్రి), నాగర్‌కర్నూల్, మహబూబాబాద్ కేంద్రాలను జిల్లాలుగా ప్రతిపాదించడంతో అక్కడ ప్రస్తుతం ఉన్న ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను జిల్లా కోర్టులుగా అప్‌గ్రేడ్ చేయాలని న్యాయశాఖ ప్రతిపాదనకు టాస్క్ఫోర్స్ కమిటీ ఆమోదం తెలిపింది. అలాగే ప్రస్తుతం ఉన్న 8 అదనపు జిల్లా జడ్జి కోర్టులను జిల్లా కోర్టులుగా అప్‌గ్రేడ్ చేయాల్సిందిగా హైకోర్టుకు ప్రతిపాదనలు పంపించాలని టాస్క్ఫోర్స్ కమిటీ ఆదేశించింది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, అదనపు జిల్లా జడ్జి కోర్టుల అప్‌గ్రేడ్ చేయడంతోపాటు కొత్తగా నిర్మల్ (ఆదిలాబాద్), పెద్దపల్లి (కరీంనగర్), హనుమకొండ (వరంగల్), భూపాలపల్లి (వరంగల్) నాలుగుచోట్ల జిల్లా కోర్టుల ఏర్పాటు చేయడానికి హైకోర్టుకు ప్రతిపాదనలు పంపించాలని నిర్ణయించింది. కొత్తగా ఏర్పాటు కాబోతున్న జిల్లాల్లో జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొత్తగా ప్రతిపాదించిన కేంద్రాల్లో ఉన్న సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాలుగా అప్‌గ్రేడ్ చేయాలని సూచించింది. జిల్లా కేంద్ర ఆస్పత్రుల కోసం కొత్తగా ప్రతిపాదించిన జిల్లా కేంద్రాల్లోని ఏరియా ఆస్పత్రులను జిల్లా ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్ చేయాలని సూచించింది. దేవాదాయ శాఖపై జరిగిన చర్చలో 13 జిల్లాలకు ఒకరిని, 14 జిల్లాలకు మరొకరిని ఇద్దరు డిప్యూటీ కమిషనర్లను నియమించాలని ప్రతిపాదనకు ఆమోదం లభించింది. స్థానిక సంస్థలు మండల, జిల్లా పరిషత్, మున్సిపాల్టీలకు పాలకమండళ్లకు ఎన్నికైన ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసే వరకు వీటిని యధాతథంగా కొనసాగించాలని కమిటీ సూచించింది.
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్ష
టాస్క్ఫోర్స్ కమిటీ కసరత్తు ముగిసిన తర్వాత దేవాదాయ, గృహ నిర్మాణ, న్యాయశాఖల అధికారులతో సంబంధిత మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్షించారు. తన పరథిలోని శాఖల ప్రతిపాదనలపై టాస్క్ఫోర్స్ కమిటీ మార్గదర్శకాల మేరకు తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు. శాఖలవారీగా కేటగిరీలవారీగా ఉద్యోగులు, సిబ్బందిని 27 జిల్లాలకు విభజనపై 7వ తేదీ వరకు తుది ప్రతిపాదనలపై నివేదికను టాస్క్ఫోర్స్ కమిటీకి అందజేయాలని ఆదేశించారు.