తెలంగాణ

కాళేశ్వరం పనులు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 2: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఆలేరు, భువనగిరి, నకిరేకల్, అసెంబ్లీ నియోజక వర్గాల్లో 2.62 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వనున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. కాళేశ్వరం పనులపై శుక్రవారం జలసౌథలో అధికారులతో చర్చించిన హరీశ్‌రావు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించే బస్వాపూర్, గంధమల రిజర్వాయర్ పనులను సమీక్షించారు. పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని కాల్వ మైనర్ ఇరిగేషన్ పథకాల విస్తరణ పనులను వెంటనే చేపట్టాలని మంత్రి ఆదేశించారు. 123 కోట్ల రూపాయల పరిపాలనా పరమైన అనుమతులు ఇచ్చినట్టు తెలిపారు. ఈ మూడు పథకాలు యాదాద్రి జిల్లా పరిధిలోకి వస్తున్నందున జిల్లాల పునర్విభజన తర్వాత ఇరిగేషన్ డిఇఇల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక సబ్ డివిజన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. మిషన్ కాకతీయ రెండో దశ పనులు నత్తనడకన సాగుతున్నాయని, మొదటి దశలో చేపట్టిన పనుల్లో ఇంకా 36 చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తి కాలేదని మంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఈ పనులన్నీ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. మిషన్ కాకతీయ మూడవ దశ పనులు త్వరలో ప్రారంభించనున్నట్టు హరీశ్‌రావు ప్రకటించారు. మూడో దశ కింద చేపట్టే చెరువులను సందర్శించి, చేపట్టాల్సిన పనుల గురించి వాస్తవ పరిస్థితితో నివేదిక అందజేయాలని ఇంజనీర్లను మంత్రి ఆదేశించారు. ట్రిపుల్ ఆర్ కింద 419 పథకాలకు కేంద్రం నుంచి ఆర్థిక సహాయం రావలసి ఉందని, ఈ పథకాలకు కేంద్రం నుంచి త్వరితగతిన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కాడా కమిషనర్ డాక్టర్ మల్సూర్‌ను మంత్రి కోరారు.జిల్లా కలెక్టర్ వద్ద డబ్బులు ఉన్నప్పటికీ డిండి భూసేకరణ బిల్లుల చెల్లింపులో జాప్యం జరగడం పట్ల మత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనివలన రిజిస్ట్రేషన్లు ఆలస్యం అవుతున్నందున సంబధిత సిఇ, ఎస్‌ఇలపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని మంత్రి ప్రశ్నించారు. ఇకపై ఇలాంటి అలసత్వాన్ని సహించేది లేదని, ప్రాధాన్యతలను బట్టి బిల్లుల చెల్లింపులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. శ్రీరాంసాగర్ రెండవ దశలో జరుగుతున్న పనులకు కొన్నిచోట్ల హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌కు చెందిన గ్యాస్ పైప్‌లైన్‌లు అడ్డుగా ఉన్నందున ఈ సమస్య పరిష్కారానికి ఢిల్లీలోని హెచ్‌పిసిఎల్, గెయిల్ ఉన్నతాధికారులతో చర్చించాలని ఎంపిలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్‌లకు మంత్రి హరీశ్‌రావు సూచించారు.
ప్రభుత్వం ప్రాధాన్యంతో చేపడుతున్న మిషన్ కాకతీయ వంటి పథకాల్లో అవినీతిని సహించేది లేదని హరీశ్‌రావు హెచ్చరించారు. అవకవతకలు, అక్రమాలకు బాధ్యులైన అధికారులు ఏ స్థాయి వారైనా విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.