రాష్ట్రీయం

విశ్వసనీయతే అంతిమ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 2: పోలీసు అధికారులకు విశ్వసనీయతే తుది లక్ష్యం కావాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమిలో శిక్షణలో ఉన్న ఐపిఎస్ యువ అధికారులు అత్యున్నత స్థాయి నిజాయితీ, వృత్తిపరమైన ప్రావీణ్యాన్ని, చిత్తశుద్ధిని అలవరుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విధి నిర్వహణలో వారు సరికొత్త ప్రమాణాన్ని నెలకొల్పాలని సూచించారు. 109 మంది ఐపిఎస్ ప్రొబేషనర్లు, 68 మంది ఆర్‌ఆర్, 15 మంది విదేశీ ప్రోబేషనర్లు ప్రస్తుతం ఈ అకాడమిలో ప్రాథమిక శిక్షణ పొందుతుండగా, 107 మంది అధికారులు ఇన్ సర్వీసు ప్రోగ్రాంలలో ఉన్నారు. వారందరిని ఉద్దేశించి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని పరిరక్షిస్తోందని అన్నారు. శిక్షణలో ఉన్న అధికారులు నిజమైన ప్రేరణను పొంది జట్టు నాయకులుగా రూపొందాలని మంత్రి వారికి సలహా ఇచ్చారు. పోలీసు బలగాలకు, ప్రజలకు మధ్య ఉన్న అంతరాన్ని భర్తీ చేయాల్సిందిగా మంత్రి సూచించారు. విశ్వసనీయత పరంగా ఏర్పడిన సంక్షోభాన్ని నివారించాలని దానిని ఒక సవాలుగా స్వీకరించి, సామాన్యుల పట్ల సానుభూతితోనూ, అంకిత భావంతోనూ వారికి చేరువ కావాలని ఆయన చెప్పారు. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీసు సర్వీసులో భాగం పంచుకున్నందుకు ప్రతి ఒక్క అధికారిని మంత్రి అభినందించారు.
నిజమైన ప్రజాసేవకులుగా పేరుతెచ్చుకోండి, జాతి కోసం పాటుపడేందుకు ఎటువంటి బాధ్యత నుండి అయినా తప్పించుకోవద్దు అంటూ మంత్రి హితవు పలికారు. జాతీయ భద్రత, ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు తదితర అంశాలపై అకాడమిలో శిక్షణ కోర్సులు నిర్వహిస్తుండటం విశేషమని పేర్కొన్నారు. అంతకుముందు రాజ్‌నాథ్ సింగ్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమి డైరెక్టర్ అరుణా బహుగుణ ఆయనకు స్వాగతం పలికారు. అకాడమికి చేరుకున్న రాజ్‌నాథ్ సింగ్ అమరవీరుల స్మారక చిహ్నం వద్ద పూలమాలను సమర్పించి స్మృత్యంజలి ఘటించారు. అనంతరం అకాడమి ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన అడ్వాన్స్‌డ్ కోర్స్ మెస్‌ను ప్రారంభించారు. అక్కడ కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమాలు, లభ్యమవుతున్న వసతి సదుపాయాల గురించి తెలుసుకోవడానికి అకాడమి అంతా కలియదిరిగారు. ఫ్యాకల్టీతోనూ, సిబ్బందితోనూ కాసేపు ముచ్చటించారు.

శుక్రవారం హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ముచ్చటిస్తున్న తెలంగాణ డిజిపి రాజీవ్ శర్మ. చిత్రంలో టి.హోం మంత్రి నాయని ఉన్నారు.