తెలంగాణ

బంద్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 2: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ప్రభుత్వ శాఖల్లో ఔట్ సోర్సింగ్‌కు నిరసనగా, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ తదితర డిమాండ్లతో శుక్రవారం కార్మిక సంఘాలు నిర్వహించిన సార్వత్రిక సమ్మె ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లాల్లోనూ సమ్మె విజయవంతమైంది. ఆర్టీసీ బస్సులు డిపోల గేటు దాట లేదు. వాణిజ్య, వ్యాపార సంస్ధలు సమ్మెలో పాల్గొన్నాయి. బ్యాంకులు, పోస్ట్ఫాసులు బంద్ పాటించాయి. కొన్ని ఎటిఎంలలో డబ్బులు లేక వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. ప్రైవేటు విద్యా సంస్ధల యజమాన్యాలు ముందుగానే సెలవు ప్రకటించాయి. సినిమా హాళ్ళ యజమానులు ఉదయం, మధ్యాహ్నం ఆటలను నిలిపి వేశారు. ఆటోలు, క్యాబ్స్ డ్రైవర్లు కూడా సమ్మెలో పాల్గొనడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విధులకు హాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగులు రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడ్డారు. అక్కడక్కడా కొంత మంది క్యాబ్స్, ఆటో డ్రైవర్లు వాహనాలు నడిపినా, ఇదే అదనుగా భావించి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశారు.
నల్లగొండ జిల్లాలో..
12 కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు నల్లగొండ జిల్లాలో సమ్మె ప్రశాంతంగా, సంపూర్ణంగా జరిగింది. జిల్లా పరిథిలోని ఏడు ఆర్టీసీ డిపోల నుంచి 743 బస్సులు రోడ్డు ఎక్కలేదు. కేవలం పది బస్హులు మాత్రమే నడవడంతో రోజు వారి 65 లక్షల ఆదాయం ఐదు లక్షలకు పడిపోయింది. జిల్లా వ్యాప్తంగా 431 భారీ, చిన్న తరహా పరిశ్రమలు మూత పడ్డాయి. సుమారు ఐదు లక్షల మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు.
నిజామాబాద్‌లో..
నిజామాబాద్ జిల్లాలో బంద్ విజయవంతమైంది. ఆరు ఆర్టీసీ డిపోలకు చెందిన కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. బ్యాంకులు, టెలికాం, పోస్ట్ఫాసుల ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొనడంతో సేవలు నిలిచిపోయాయి. పెట్రోలు బంకులు, సినిమా థియేటర్లు మూసి ఉంచారు. మండల కేంద్రాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, ఆశావర్కర్లు, ఎఎన్‌ఎంలు, సాక్షర భారత్ కేంద్రాల కో-ఆర్డినేటర్లు రోడ్లపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
వరంగల్‌లో..
జిల్లాలో బంద్ విజయవంతమైంది. ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు బయటకు రానీయకుండా, ప్రధాన గేట్ల ముందు కార్మికులు ధర్నాలు చేశారు. టైర్లు తగులబెట్టారు. సార్వత్రిక సమ్మెకు కాంగ్రెస్, వామపక్షాల నాయకులు సంఘీభావంగా ర్యాలీ నిర్వహించారు. హన్మకొండ హెచ్ పోస్ట్ఫాస్ ముందు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. కాగా సాయంత్రం నుంచి కొన్ని బస్సులను నడిపారు.
కరీంనగర్‌లో..
ఆర్టీసీ బస్సులు కదలకపోవడంతో జిల్లాలోని 11 డిపోలకు సుమారు కోటి రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా. సింగరేణి కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో రామగుండం ప్రాంతంలోని తొమ్మిది భూగర్భ, నాలుగు ఉపరితల గనుల్లో కలిపి సుమారు 65 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచి పోయింది. బీమా రంగ సంస్ధల్లో కార్యకలాపాలు కొనసాగలేదు.
ఆదిలాబాద్‌లో..
జిల్లాలో సమ్మె విజయవంతమైంది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టిబిజికెఎస్‌తో పాటు ఐదు జాతీయ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడండో కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. దీంతో జిల్లాలోని మందిమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి డివిజన్‌లోని బొగ్గు గనులన్నీ బోసిపోయాయి.
మహబూబ్‌నగర్ జిల్లాలో..
సార్వత్రిక సమ్మెతో జిల్లాలోని షాద్‌నగర్ పారిశ్రామిక వాడల్లో పరిశ్రమలు మూతపడ్డాయి. వేలాది మంది కార్మికులు పరిశ్రమల ఎదుట ధర్నా నిర్వహించారు. అనేక ప్రాంతాల్లో కార్మికులు రోడ్డలపైకి వచ్చి నిరసనగా బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మెదక్ జిల్లాలో..
సమ్మెతో కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. పారిశ్రామిక ప్రాంతాలైన పటాన్‌చెరువు, రామచంద్రాపురం, జిన్నారం, ఐడిఎ బొల్లారం, సంగారెడ్డి తదితర ప్రాంతాలల్లోని పరిశ్రమలకు చెందిన రెండు లక్షల మంది కార్మికులు, నాలుగు లక్షల మంది అసంఘటిత కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.

సికిందరాబాద్ స్టేషన్

కరీంనగర్ బస్టాండ్

సంగారెడ్డిలో కార్మిక సంఘాల బైక్ ర్యాలీ

నిర్మానుష్యంగా
మారిన
సింగరేణి
బొగ్గు గనులు