తెలంగాణ

పోలీసు నియామకాలకు అనుమతివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 3: కొత్త జిల్లాలు ఏర్పాటు నేపథ్యంలో పోలీస్ శాఖలో సిబ్బంది కొరతను డిజిపి అనురాగ్ శర్మ సిఎస్ రాజీవ్ శర్మ దృష్టికి తీసుకెళ్లారు. పోలీస్ శాఖలో నూతన నియామకాలకు అనుమతివ్వాలని ఆయన సిఎస్‌ను కోరారు. శనివారం కార్మిక, హోంశాఖల్లో ఉద్యోగుల సర్దుబాటు, జిల్లాల విభజనపై నిర్వహించిన అధికారుల సమీక్షలో డిజిపి అనురాగ్‌శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయాలు, సిబ్బంది కొరతపై చర్చించారు. దీంతో కొత్త జిల్లాల్లో ఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సిఎస్ రాజీవ్ శర్మ అధికారులకు ఆదేశించారు. ఎస్పీ కార్యాలయాలకు భవనాలు, ఫర్నిచర్, వాహనాల సర్దుబాటు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. తాత్కాలిక ప్రతిపాదికన సిబ్బంది నియామక ముసాయిదాను రూపొందించాలని కూడా సిఎస్ అధికారులకు సూచించారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యలో పాలనకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.