తెలంగాణ

ఆన్‌లైన్ అడ్మిషన్లపై పునరాలోచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, సెప్టెంబర్ 3: డిగ్రీలో ప్రవేశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ విధానం వలన విద్యార్థుల్లో అయోమయం నెలకొందని జెఎసి చైర్మన్ ఆచార్య కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా కోదాడలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఆన్‌లైన్ అడ్మిషన్‌ల వలన విద్యార్థులకు కొన్ని కాలేజీల్లో సీట్లు దొరకలేదని, మరికొన్ని కాలేజీల్లో అడ్మిషన్లు లేక సీట్లు మిగిలిపోయాయని ఆయన వివరించారు. ప్రభుత్వం ఆన్‌లైన్ అడ్మిషన్లపై పునరాలోచన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిబంధనల పేరిట ప్రైవేట్ విద్యాసంస్థలను వేధించకుండా విద్యాసంస్థలకు ఉండాల్సిన ప్రమాణాలను ముందుగా నిర్ణయించి నియంత్రణ చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో పర్యవేక్షణ పేరిట అధికారులు ప్రైవేట్ విద్యాసంస్ధలపై వేధింపులకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం విడుదల చేయకపోవడం వలన విద్యార్థులు చదువుకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.